Donald Trump: కెనడా, మెక్సికో, చైనాలకు షాకిచ్చిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విధానంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకం, అలాగే చైనా దిగుమతులపై 10% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.
గతంలో ఇదే విషయంపై అనేకసార్లు హెచ్చరించిన ట్రంప్ తాజాగా ఆ హెచ్చరికలను అమలులోకి తెచ్చారు. తాజాగా సుంకాల విధింపు ఉత్తర్వులపై ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు.
నేడు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు అధికారికంగా సంతకం చేశానని ట్రంప్ ప్రకటించారు.
Details
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు కఠినంగా మారే అవకాశం
ఫెంటనిల్ సహా ప్రాణాంతక మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలువరించడాన్నే చూపించారు.
అమెరికా పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదకద్రవ్యాల ముప్పును తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నామన్నారు.
తన బాధ్యత అమెరికన్లను రక్షించడం. చట్టవిరుద్ధ వలసదారులు, మాదక ద్రవ్యాలు తమ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
ఈ కొత్త నిర్ణయంతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు మరింత కఠినంగా మారే అవకాశముంది.
అలాగే కెనడా, మెక్సికోతో కూడా వాణిజ్య ఒప్పందాలపై కొత్త చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.