Page Loader
Trump and Harris: ట్రంప్‌ vs హారిస్‌.. స్వింగ్‌ రాష్ట్రాల్లో విజేత ఎవరు..? 
ట్రంప్‌ vs హారిస్‌.. స్వింగ్‌ రాష్ట్రాల్లో విజేత ఎవరు..?

Trump and Harris: ట్రంప్‌ vs హారిస్‌.. స్వింగ్‌ రాష్ట్రాల్లో విజేత ఎవరు..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2024
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, ప్రధాన అభ్యర్థులు కమలా హారిస్‌ (డెమోక్రాటిక్‌ పార్టీ), డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ) తమ దృష్టిని ప్రధానంగా స్వింగ్‌ రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు. ఈ రాష్ట్రాలు తటస్థ ఓటర్ల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల కీలకంగా మారాయి. 2020 ఎన్నికల్లో జో బైడెన్‌ ఆరింట గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఒక్క నార్త్‌ కరోలినాలో మాత్రమే ట్రంప్‌ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌లు స్వింగ్‌ రాష్ట్రాలుగా గుర్తింపు పొందుతున్నాయి.

Details

స్వింగ్ రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్ ఓట్లు

అమెరికా ఓటర్లు సాధారణంగా రిపబ్లికన్లు లేదా డెమోక్రాట్లుగా మద్దతు తెలుపుతారు. కానీ స్వింగ్‌ రాష్ట్రాల్లో ప్రజలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉండటం వల్ల, అక్కడి ఫలితాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఇవే అధ్యక్ష పీఠం కోసం పోరులో కీలకంగా మారతాయని భావిస్తున్నారు. 1)పెన్సిల్వేనియా ఎలక్టోరల్‌ ఓట్లు: 19 2020లో: బైడెన్‌ 1.16% ఆధిక్యం వలసదారుల అంశం, పారిశ్రామిక సమస్యలపై రిపబ్లికన్లు, పట్టణ ప్రాంతాల్లో డెమోక్రాట్లు తమ ప్రచారాన్ని సర్వశక్తులూ ఒడుతున్నారు.

Details

2) విస్కాన్సిన్

ఎలక్టోరల్‌ ఓట్లు: 10 2020లో: బైడెన్‌ 0.63% ఆధిక్యం 2016లో ట్రంప్‌ గెలవగా, 2020లో స్వల్పతేడాతో బైడెన్‌ పైచేయి సాధించారు. ఈసారి మూడో పార్టీ అభ్యర్థులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 3)మిషిగన్ ఎలక్టోరల్‌ ఓట్లు: 15 2020లో: బైడెన్‌ 2.78% ఆధిక్యం అరబ్-అమెరికన్‌ ఓటర్లలో డెమోక్రాట్లపై నిరాశ వ్యక్తమవుతోంది, అయితే ట్రంప్‌ కూడా ఇక్కడ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 4)నార్త్‌ కరోలినా ఎలక్టోరల్‌ ఓట్లు: 16 2020లో: ట్రంప్‌ 1.35% ఆధిక్యం డెమోక్రాట్లు ఆఫ్రో-అమెరికన్‌ ఓట్లపై ఆశపెట్టుకోగా, రిపబ్లికన్లు హెలెన్‌ తుపానీ ప్రభావంపై ప్రచారం నడుపుతున్నారు.

Details

5)జార్జియా 

ఎలక్టోరల్‌ ఓట్లు: 16 2020లో: బైడెన్‌ 0.24% ఆధిక్యం 2020లో బైడెన్‌ స్వల్ప ఆధిక్యంలో గెలిచినా, ఈసారి ట్రంప్‌కు కేసులు ఎదురవుతున్నా, ఆయనకు కొంత ఊరట లభించింది. 6)ఆరిజోనా ఎలక్టోరల్‌ ఓట్లు: 11 2020లో: బైడెన్‌ 0.31% ఆధిక్యం సరిహద్దుల సమస్యపై రిపబ్లికన్లు ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్నా, డెమోక్రాట్లు వలస నియంత్రణపై తమ హామీలను ప్రజలకు వినిపిస్తున్నారు. 7)నెవడా ఎలక్టోరల్‌ ఓట్లు: 6 2020లో: బైడెన్‌ 2.39% ఆధిక్యం ఈ రాష్ట్రం ఆతిథ్యరంగం మీద ఆధారపడి ఉండటంతో, కోవిడ్‌ తర్వాత ఆర్థికంగా వెనుకబడింది. ఈ సందర్భంలో రిపబ్లికన్లు హిస్పానిక్‌ ఓట్లతో తమ ఆధిపత్యాన్ని పొందాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రాలు ఎన్నికల ఫలితాలను మార్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.