Joe Biden: ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్.. బైడెన్‌కు ఆ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు రహస్య సమాచారం అందించాల్సిన అవసరం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం జో బైడెన్‌కి రహస్య సమాచారానికి ప్రాప్తి అవసరం లేదని, అందుకే ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నామని చెప్పారు.
రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను నిలిపివేస్తున్నామని, 2021లో తనకు జాతీయ భద్రతా సమాచారాన్ని అందించడాన్ని ఆపేశారని ట్రంప్ గుర్తు చేశారు.
దానికి ప్రతిగా తాను ఈ చర్యలు చేపడుతున్నానని, బైడెన్ జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోందన్నారు.
Details
2021లో ట్రంప్ కు ఆ అధికారాన్ని తొలగించిన బైడెన్
కావున దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారంపై జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, జాతీయ భద్రతను ఎల్లప్పుడూ రక్షిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా సంప్రదాయం ప్రకారం, దేశ మాజీ అధ్యక్షులకు జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం పొందే హక్కు ఉంటుంది.
2021లో అధ్యక్ష పదవిని చేపట్టిన బైడెన్, అప్పటి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ అధికారం తొలగించారు. దీనికి ప్రతీకారంగా ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.