US Border : అమెరికాలోకి పెరిగిన భారతీయుల అక్రమ ప్రవేశాలు.. ఎంత మందో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య భాగా పెరిగింది. గతేడాది, 2019 - 2020 సంవత్సరంతో పోలిస్తే, యూఎస్ఏలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య సుమారు ఐదు రెట్లుకు చేరుకుంది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన భారతీయుల సంఖ్య 96,917కు దూసుకెళ్లింది. అయితే సరిహద్దుల వద్దే వీరిని యూఎస్ఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
2019 - 2020 ఏడాదిలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయిన భారతీయుల సంఖ్య కేవలం 19,883గా ఉంది.
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(UCBP) అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు.ప్రధానంగా కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు.
details
ఈ మధ్య భారత్ సహా ఇతర దేశాల పౌరుల అక్రమ వలసలు పెరిగాయి
కెనడా బోర్డర్ నుంచి 30,010 మంది, మెక్సికో సరిహద్దుల నుంచి 41,770 మంది అగ్రరాజ్యంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించడం గమనార్హం.
అయితే అక్రమంగా వెళ్లిన ఇతర భారతీయులను చూసి, తాము కూడా అలాగే వెళ్లాలని భావించి అగ్రరాజ్యం కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు.
ఇప్పటివరకు మెక్సికో, గ్వాంటెమాలా, హోండురస్, ఈక్వెడార్ దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు.ఈ మధ్య కాలంలో భారతదేశం సహా ఇతర దేశాల పౌరుల సంఖ్య ఎక్కువైపోయింది.
మరోవైపు సింగిల్ గా ప్రవేశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గతేడాదిలో సింగిల్ గా వెళ్లాలనుకున్నవారు 84 వేల మందిగా నమోదయ్యారు.
ఇదే సమయంలో 730 మంది పిల్లలు(పెద్దల తోడు లేకుండా) అక్రమంగా వెళ్లాలనుకుని పోలీసుల కంటపడ్డారు. ఫలితంగా అరెస్ట్ అయ్యారు.