LOADING...
Joe Biden: జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ 
జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ

Joe Biden: జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని, కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లో అధికార కేంద్రీకరణ జరుగుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరో ఐదు రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న బైడెన్‌ ఓవల్‌ కార్యాలయం నుంచి తన వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి కలిగిన సామ్రాజ్యవాదం ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలు తప్పుడు ప్రచారాలను చూడాల్సి వస్తుందని, పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

సోషల్‌ మీడియాలో అసత్య కథనాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి 

ఈ పరిణామాలు అధికార దుర్వినియోగానికి దారితీస్తాయని, సోషల్‌ మీడియాలో అసత్య కథనాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని, అధికారం కోసం నిజం అణిచివేయబడుతోందని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార దుర్వినియోగాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతి అమెరికా పౌరుడు తమ హక్కులను రక్షించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో, జనవరి 20న డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు హాజరు కానున్నారని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడ్కోలు ప్రసంగం చేస్తున్న బైడెన్