Page Loader
USA:'దానిపై వ్యాఖ్యలు చేయను..'పాక్ జర్నలిస్టుకు ఝలక్ ఇచ్చిన టామ్మీ బ్రూస్‌
పాక్ జర్నలిస్టుకు ఝలక్ ఇచ్చిన టామ్మీ బ్రూస్‌

USA:'దానిపై వ్యాఖ్యలు చేయను..'పాక్ జర్నలిస్టుకు ఝలక్ ఇచ్చిన టామ్మీ బ్రూస్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై విమర్శలు రాబట్టే క్రమంలో అమెరికా విదేశాంగ శాఖను ప్రశ్నించిన పాకిస్థాన్ జర్నలిస్టుకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీనితో పాటు, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి సందర్భంలో వాషింగ్టన్‌ ప్రభుత్వానికి భారతదేశం పట్ల ఉన్న మద్దతును స్పష్టంగా తెలియజేసే మరో ఘటన జరిగింది.

వివరాలు 

ట్రంప్, సెనేటర్ మార్కో రూబియో ఈ అంశంపై మాట్లాడారు

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌ను ఓ పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నించగా, ఆమె స్పష్టంగా స్పందిస్తూ.. "ఆ విషయంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. మనం ఇతర విషయాలపై చర్చిద్దాం.ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, సెనేటర్ మార్కో రూబియో ఈ అంశంపై మాట్లాడారు. మళ్లీ నేను అదే విషయాన్ని పునరావృతం చేయను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని,గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ఇలాంటి హేయకార్యానికి పాల్పడినవారు తప్పనిసరిగా శిక్షను పొందాలనే ఆశిస్తున్నాను" అని తెలిపారు.

వివరాలు 

పాక్ హస్తం ఉందా?  

పహల్గాం దాడిపై పాక్ పాత్ర ఉందని భావిస్తున్నారా?ఉద్రిక్తతలను తగ్గించేందుకు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలకు కూడా టామీ బ్రూస్ స్పందిస్తూ.."పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూ కశ్మీర్‌ విషయంలో మనం ఎలాంటి అధికారిక నిలువు తీసుకోలేదు" అని స్పష్టం చేశారు. ట్రంప్ తొలి రోజు నుంచే స్పందన పహల్గాం ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో స్పందిస్తూ.. "కశ్మీర్‌లో జరిగిన ఈ దాడి నన్ను తీవ్రమైన స్థాయిలో కలిచివేసింది.తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు మా మద్దతు ఉంటుంది.ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.గాయపడినవారు త్వరగా కోలుకోవాలి.ప్రధాని మోదీ,భారత ప్రజల పట్ల మా సంపూర్ణ మద్దతు ఉంటుంది"అని పేర్కొన్నారు.

వివరాలు 

న్యూయార్క్ టైమ్స్ కవరేజీపై అమెరికా అసంతృప్తి 

పహల్గాం ఉగ్రదాడిపై అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన కవరేజీపై అమెరికా ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 'హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ' తన ఎక్స్‌ (పూర్వంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని ఎత్తిచూపింది. ఆ పత్రిక ప్రచురించిన కథనంలో దాడిచేసినవారిని 'ఉగ్రవాదులు'గా కాకుండా 'మిలిటెంట్లు'గా చూపిస్తూ, తప్పుదారి పట్టించేలా కథనం ఇచ్చినందుకు తీవ్రంగా విమర్శించింది. ఆ కథనంలో "మిలిటెంట్లు", "గన్‌మెన్‌లు (సాయుధులు)" అనే పదాలతో వారి ఉద్దేశాన్ని మృదువుగా చూపించాలని ప్రయత్నించిందని ఆరోపించింది.

వివరాలు 

న్యూయార్క్ టైమ్స్ వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంది

దాడిని కూడా ఒక సాధారణ కాల్పుల ఘటనలా రాసిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ కథన క్లిప్పింగ్‌ను ఎర్ర అక్షరాలతో సరిచేస్తూ, 'హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ' ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. "హేయ్ న్యూయార్క్ టైమ్స్, నీ కోసం ఈ తప్పును మేమే సరిచేశాము. సూటిగా చెప్పాలంటే ఇది 'ఒక ఉగ్రదాడి'. భారత్ లేదా ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదం జరిగినప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంది" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాక్ జర్నలిస్టుకు ఝలక్ ఇచ్చిన టామ్మీ బ్రూస్‌