Page Loader
America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు 
అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు

America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2023
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూజెర్సీలో 23 ఏళ్ళ భార‌త విద్యార్థి ఓం బ్రహ్మ్‌భట్‌పై ట్రిఫుల్ మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. కండోమినియంలోని త‌న నివాసంలో తాత, నాయిన‌మ్మ‌తోపాటు మామను కూడా కాల్చి చంపిన‌ట్టు స్థానిక పోలీసులు విద్యార్థిపై అభియోగాలు మోపారు. సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు దిలీప్‌కుమార్ బ్రహ్మభట్(72),బిందు బ్రహ్మభట్ (72),యష్‌కుమార్ బ్రహ్మభట్(38),ను ఓం బ్రహ్మ్‌భట్‌ కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో మూడు మృత‌దేహాల‌ను గుర్తించామని అందులో ఇద్ద‌రు పురుషులు, ఒక మ‌హిళ ఉన్న‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. రెండో అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో దిలీప్‌కుమార్, బిందు బ్రహ్మభట్ కాల్చి చంపబడ్డారని పోలీసులు తెలిపారు.వారి కుమారుడు యష్‌కుమార్ బ్రహ్మభట్‌కు కూడా అనేక తుపాకీ గాయాలు ఉన్నట్లు గుర్తించారు.అతన్ని ఆసుపత్రికి తరలించగా,అతను మరణించాడు.

Details 

2నెలల క్రితమే న్యూజెర్సీకి ఓం 

సంఘటనా స్థలంలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం కేసు నమోదు చేశారు. ఓం పై ఫస్ట్-డిగ్రీ మర్డర్,సెకండ్-డిగ్రీ ఆయుధాలను కలిగి ఉన్నట్లు 3 అభియోగాలు మోపారు. గుజరాత్‌కు చెందిన ఓం,బాధితులతో కలిసి ఉంటున్నాడు. ఓం 2నెలల క్రితమే న్యూజెర్సీకి వెళ్లాడని,కాండోలో నివశిస్తున్నట్లు NBC నివేదించింది. సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. కాల్పులకు సంబంధించిన సమాచారం ఉన్నఎవరైనా టౌన్ పోలీసులకు లేదా మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి కాల్ చేయమని తెలిపారు. సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ డిటెక్టివ్ థామస్ రట్టర్,మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ డిటెక్టివ్ జేవియర్ మోరిల్లో జరిపిన విచారణలో ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని, ఇది యాదృచ్ఛిక హింస కాదని నిర్ధారించినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు