
Lalit Modi, Vijay Mallya: లండన్ లోని లావిష్ పార్టీలో కలిసి పాటలు పాడుతున్నలలిత్ మోడీ,విజయ్ మాల్యా .. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. కానీ ఇప్పుడు వీరిద్దరూ భారత ప్రభుత్వానికి ఆర్థిక నేరగాళ్లుగా గుర్తింపు పొందినవారు. వీరిద్దరూ విదేశాల్లో తలదాచుకుంటూ, చట్టానికి దూరంగా ఉన్నా, ఇటీవల ఓ పార్టీలో కలిసిపోయి సంబరంగా గడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెరికన్ గాయకుడు ఫ్రాంక్ సినాత్రా ఆలపించిన ప్రసిద్ధ పాట "I Did It My Way"ను ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. ఈ సంఘటన లండన్‌లో గత ఆదివారం లలిత్ మోదీ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలాసవంతమైన పార్టీ సందర్భంగా జరిగింది.
వివరాలు
310 మందికి పైగా అతిథులు
ఈ వీడియోను స్వయంగా లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, "కాంట్రవర్శియల్ అనడం ఖచ్చితమే, కానీ అదే నేనూ చేయగలిగే ఉత్తమ విషయం" అంటూ వ్యాఖ్యను కూడా జత చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ అద్భుత వేడుకను లలిత్ మోదీ తన లండన్ నివాసంలోనే ఘనంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 310 మందికి పైగా అతిథులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారని ఆయన వెల్లడించారు. వీరిలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను దుమ్ములేపకపోతే ఆశ్చర్యమే. "వివాదాస్పదమవుతుందేమో. అయితే అదే నా శైలి!" అంటూ చివరగా లలిత్ మోదీ మరోసారి కామెంట్ చేశారు.
వివరాలు
లలిత్ మోదీ,విజయ్ మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గేల్
క్రిస్ గేల్ గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లలిత్ మోదీ, విజయ్ మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను గేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, We living it up. Thanks for a lovely evening" అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచిపోయి బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనపై ఐపీఎల్ బిడ్‌లలో అవినీతి,మనీ లాండరింగ్,విదేశీ మారక చట్టం ఉల్లంఘనల కేసులు ఉన్నాయి.
వివరాలు
రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాల మోసంలో విజయ్ మాల్యా
విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాల మోసంలో భారత్‌కు కావలసిన నిందితుడిగా ఉన్నారు. 2017లో లండన్‌లో అరెస్టైన మాల్యా, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. చట్టపరంగా సమస్యల్లో ఉన్నా,వీరిద్దరూ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం,ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం,ఇంటర్వ్యూలలో కనిపించడం నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
London --Vijay Mallya, Lalit Modi, Chris Gayle and others partying at *Lalit Modi Mansion in Belgravia, Greater London*. pic.twitter.com/8106a1CzAP
— Jayprrakash Singh (@jayprakashindia) July 4, 2025