Page Loader
Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  
భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే: పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ను కలుసుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్‌ సమస్య, ఉగ్రవాదం, వాణిజ్య సంబంధాలు, జల వనరుల విభేదాలు తదితర అంశాలపై భారత్‌తో చర్చించేందుకు తాము పూర్తిగా సిద్ధమని షరీఫ్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

చర్చల్లో మూడోపక్షం జోక్యం ఉండకూడదు: మోడీ 

"కశ్మీర్‌, ఉగ్రవాదం,నీటి పంపిణీ సమస్యలు,వ్యాపార సంబంధాల విషయంలో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.ఇవన్నీ సమస్యలుగా కాకుండా,చర్చల ద్వారా పరిష్కరించవచ్చని మేము నమ్ముతున్నాం" అని వివరించారు. అయితే, ఒకవేళ భారత్‌ యుద్ధ దారిని ఎంచుకుంటే, తాము కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఇక మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించిన తరువాతే చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు, భారత్‌-పాకిస్తాన్‌ చర్చలు జరిగితే అవి ప్రధానంగా ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే జరగనున్నాయని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ రెండు దేశాల మధ్య జరిగే చర్చల్లో ఎటువంటి మూడోపక్షం జోక్యం ఉండదని కూడా భారత్‌ స్పష్టంగా తెలిపింది.