
Donald Trump: భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో డోనాల్డ్ ట్రంప్ పాత్ర కీలకం..మళ్ళీ అదే పాట పాడిన వైట్ హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతింపజేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన వైట్ హౌస్ మరోసారి స్పష్టం చేసింది. ట్రంప్ అధికార పటిష్ట వ్యవస్థలోని అనేక మంది కీలక అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. భారత్-పాక్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆపేశారని, అలాగే రష్యా-ఉక్రెయిన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం చేసి శాంతి ఏర్పరచడానికి ప్రయత్నించినట్టు వైట్ హౌస్ మరోసారి స్పష్టం చేసింది. గాజాలో శాంతి చర్చలు జరిపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, అతని ఆ ప్రయత్నాల వల్లే పలువురు బందీలు విడుదలయ్యారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో చెప్పారు.
వివరాలు
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదు: భారత్
ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్‌లోని అణు సౌకర్యాలను పూర్తిగా నాశనం చేసినట్టు కూడా ఆమె వివరించారు. "మేము అనేక యుద్ధాలను ఆపగలిగాము. భారత్-పాకిస్తాన్ దేశాలు అణ్వాయుధ శక్తులతో కూడిన దేశాలు. ఇవి పరస్పరం ఘర్షణపడుతున్నాయి. దీని వల్ల ఏ విధమైన భయంకరమైన పరిణామాలు ఎదురయ్యేవో అందరికీ తెలుసు. కానీ ఆ యుద్ధాన్ని మేము అడ్డుకున్నాం.ఇటీవలి కాలంలో ఇరాన్‌లో మేము చేసిన దాడులను ప్రపంచమంతా చూశారు. ఆ దేశ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాము. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మేము వ్యాపార సంబంధాల ద్వారా పరిష్కరించగలిగామని" కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. అయితే భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది.