అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఛాతి వద్ద క్యాన్సర్ సోకినట్లు శుక్రవారం వైట్‌హౌస్ వైద్యులు ప్రకటించారు. ఫిబ్రవరిలో అధ్యక్షుడి ఛాతీ నుంచి క్యాన్సర్ కణజాలాన్ని తొలగించనట్లు వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ సీఓ కానర్ చెప్పారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అని అంటారని, ఇది ఒక రకమైన క్యాన్సర్ వెల్లడించారు. ఫిబ్రవరి 16న వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్‌లో క్యాన్సర్ కణజాలం విజయవంతంగా తొలగించినట్లు, బిడెన్‌కు తదుపరి చికిత్స అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్‌కి రాసిన లేఖలో కానర్ పేర్కొన్నారు.
బైడెన్‌కు ప్రతిరోజూ పరీక్షలు చేస్తున్నాం: వైద్యులు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హౌస్ వైద్యుడు కెవిన్ సీఓ కానర్ చెప్పారు. అయితే బైడెన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు, రోజువారీగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్ కణజాలం వ్యాప్తి ఉండదని వివరించారు. అయితే ఊపిరితిత్తులపై ఏర్పడే ఈ క్యాన్సర్ కణజాలాన్ని తొలగించడం చాలా సవాళ్లతో కూడకున్నదని కానర్ చెప్పారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చ జరుగుతోంది.