Shyamala Gopalan: కమల సిరులలో విప్లవ జ్యోతిని నింపిన శ్యామలా గోపాలన్ ఎవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శుక్రవారం (ఆగస్టు 23) చికాగోలో అంగీకరించి జాతీయ సదస్సులో హారిస్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తల్లి డా. శ్యామలా గోపాలన్ హారిస్ కు నివాళులర్పించారు. ''జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని,మహిళలకు ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్‌ను నయం చేసే శాస్త్రవేత్త కావాలని మా అమ్మ కలలు కనేది.అదే లక్ష్యం,సంకల్పంతో తన 19 ఏళ్ల వయసులో సప్త సముద్రాలు దాటి భారత్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చింది.న జీవితం, భవిష్యత్తుపై మా అమ్మ ఎప్పుడూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేది. నన్ను,చెల్లి మాయను కూడా అలాగే తీర్చిదిద్దింది''అని కమలాహారిస్ అమ్మతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
శ్యామలా గోపాలన్ ఎవరు?
కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్ నిపుణురాలు,ఆమె 1960లో కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఎండోక్రినాలజీలో డాక్టరేట్ కోసం తమిళనాడు నుండి విదేశాలకు వెళ్లారు. గోపాలన్ 25సంవత్సరాల వయస్సులో డాక్టరేట్ పొందారు.ప్రముఖ రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు. బర్కిలీలో,ఆమె హారిస్ తండ్రి డోనాల్డ్ హారిస్‌ను కలుసుకుంది, ఆమె 1963లో వివాహం చేసుకుంది. 1971లో విడాకులు తీసుకుంది. "ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత, ఆమె వివాహం కోసం ఇండియాకి తిరిగి వచ్చే సమయంలో జమైకాకు చెందిన విద్యార్థి అయిన డొనాల్డ్ హారిస్‌ను కలుసుకుంది. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమల సోదరి,మాయా హారిస్ కూడా DNCలో మాట్లాడారు.తమ తల్లి మెరుగైన జీవితాన్ని కొనసాగించడానికి భారతదేశం నుండి USకి ఎలా తరలివెళ్లిందో గుర్తుచేసుకున్నారు.