Page Loader
Bangladesh: బంగ్లాదేశీయులు బాటా,పిజ్జా హట్,కెఎఫ్‌సి అవుట్‌లెట్లపై ఎందుకు దాడి చేస్తున్నారు?
బంగ్లాదేశీయులు బాటా,పిజ్జా హట్,కెఎఫ్‌సి అవుట్‌లెట్లపై ఎందుకు దాడి చేస్తున్నారు?

Bangladesh: బంగ్లాదేశీయులు బాటా,పిజ్జా హట్,కెఎఫ్‌సి అవుట్‌లెట్లపై ఎందుకు దాడి చేస్తున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఈసారి ఆందోళనల లక్ష్యం ఇజ్రాయెల్‌ అయ్యింది. రాజధాని ఢాకాలో నిరసనకారులు అంతర్జాతీయ సంస్థలపై దాడులకు దిగారు. పలు దుకాణాలు ధ్వంసం చేయడమే కాకుండా దోచుకున్నారు కూడా. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతూ వైరల్‌గా మారాయి. గాజా పట్టణంపై ఇజ్రాయెల్‌ చేపట్టిన బాంబు దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ ప్రజలు నినాదాలు చేశారు. గాజా మీద జరుగుతున్న ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా, పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సిల్హెట్‌, చట్టోగ్రామ్‌, ఖుల్నా, బారిషల్‌, కుమిల్లా, ఢాకా నగరాల్లో వేలాదిమంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

వివరాలు 

గాజాలో జరిగిన మారణహోమాన్ని' ఖండిస్తూ ప్లకార్డులు 

ఈ ఆందోళనల సమయంలో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉందని భావించిన బాటా, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌, పూమా, డొమినోస్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల దుకాణాలపై నిరసనకారులు ఆగ్రహం వెళ్లగక్కారు. వీటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించారు. కొన్ని స్టోర్లను ధ్వంసం చేసి, అక్కడి వస్తువులను దోచుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వేగంగా విస్తరించాయి. బోగ్రా నగరంలో, వందలాది మంది విద్యార్థులు,స్థానికులు 'గాజాలో జరిగిన మారణహోమాన్ని' ఖండిస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సందడిగా ఉండే సత్మాత కూడలి వైపు ర్యాలీ చేశారు. అంతర్జాతీయ బ్రాండ్లు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని చాలామంది పిలుపునిచ్చారు.

వివరాలు 

కెఎఫ్‌సి అవుట్‌లెట్‌లోకి ప్రదర్శనకారులు

బాటా షోరూంపై జనం దాడి చేయడంతో ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు భవనంపై ఇటుకలను విసిరి, దాని గాజు తలుపులను పగలగొట్టారు. ఉద్యోగులు లోపలి నుండి తలుపులు లాక్ చేయడంతో కొంత మేర ప్రమాదం తప్పింది. "నిరసనకారులు ఇటుకలు విసిరి గాజును పగలగొట్టినప్పటికీ, పెద్దగా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు" అని బోగ్రా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి-ఇన్-ఛార్జ్ (OC) SM మొయినుద్దీన్ అన్నారు. తూర్పు నగరమైన సిల్హెట్‌లో, మిర్‌బోక్స్తులా ప్రాంతంలోని కెఎఫ్‌సి అవుట్‌లెట్‌లోకి ప్రదర్శనకారులు దూసుకెళ్లడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న శీతల పానీయాల బాటిళ్లను ఆవరణలోనే పగలగొట్టారని బంగ్లా ట్రిబ్యూన్ నివేదించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో రెస్టారెంట్ మూసివేయబడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియోలు ఇవే..