Page Loader
Vivek Ramaswamy: DOGE నుండి వివేక్ రామస్వామి ఎందుకు నిష్క్రమించారు.. కారణం ఏంటి..?
DOGE నుండి వివేక్ రామస్వామి ఎందుకు నిష్క్రమించారు.. కారణం ఏంటి..?

Vivek Ramaswamy: DOGE నుండి వివేక్ రామస్వామి ఎందుకు నిష్క్రమించారు.. కారణం ఏంటి..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు. ఆయన ట్రంప్‌ కార్యవర్గం నుంచి వైదొలగినట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్‌ రామస్వామి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, చివరికి ఆయన రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం ట్రంప్‌ గెలుపు కోసం అతను తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలో, తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్‌ రామస్వామితో పాటు ఎలాన్‌ మస్క్‌కు కూడా ట్రంప్‌ తన కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టారు.

వివరాలు 

రామస్వామి నిర్ణయం వెనుక ఒక ప్రత్యేక కారణం 

అలాగే, తన కార్యవర్గంలో కీలకమైన డోజ్‌ (DOGE) - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ శాఖ బాధ్యతలను వారిద్దరికీ అప్పగించినట్లు ట్రంప్‌ ప్రకటించారు. మెరుగైన పాలన కోసం, ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించే లక్ష్యంతో ఈ శాఖకు రామస్వామి, మస్క్‌ నేతృత్వం వహించేందుకు పథకాలు సిద్ధం చేశారు. అయితే, ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రామస్వామి చేసిన ఈ అనూహ్య నిర్ణయం పట్ల ఆసక్తి వ్యక్తమవుతోంది. రామస్వామి నిర్ణయం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని తెలుస్తోంది. ఒహైయో గవర్నర్‌ పోటీలో పాల్గొనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒహైయో గవర్నర్‌ ఎన్నికలు వచ్చే ఏడాది నవంబరులో జరగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వివేక్ రామస్వామి చేసిన ట్వీట్