
Maruti Suzuki: పోర్ట్‌ఫోలియో మొత్తానికి కొత్త 'సేఫ్టీ షీల్డ్' ప్యాకేజీలను పరిచయం చేసిన మారుతీ సుజుకీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఆటో మొబైల్ వినియోగదారులు ఈ రోజుల్లో కేవలం వాహనాల ధర రేంజ్‌నే కాకుండా, భద్రతా లక్షణాలను కూడా ముఖ్యంగా చూసుకుంటున్నారు. కారు కొనుగోలుకు ముందుగా భద్రతా ఫీచర్లను సమీక్షిస్తుంటారు. అయితే, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ భద్రతపై తగినంత దృష్టి పెట్టకపోవడంపై కొన్ని కాలం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు గ్లోబల్ NCAP, భారత్ NCAP వంటి భద్రతా మానదండాల్లో మంచి రేటింగులు సాధిస్తుంటే, మారుతీ సుజుకీ మాత్రం భద్రతా ప్రమాణాలను పెంపొందించడంలో వెనుకబడిందనే అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతం, ఐదు స్టార్ NCAP రేటింగ్ సాధించిన ఏకైక మారుతీ కారు కొత్త తరం డిజైర్ మాత్రమే.
వివరాలు
కొత్త సేఫ్టీ షీల్డ్ ప్యాకేజీల ముఖ్య ఫీచర్లు:
ఈ నేపథ్యంలో వచ్చిన విమర్శలను పాజిటివ్‌గా స్వీకరించి,మారుతీ సుజుకీ తన వాహనాలను సేఫ్టీ ఫీచర్లతో అప్డేట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. తాజా ప్రకటన ప్రకారం, 'నెక్సా సేఫ్టీ షీల్డ్','అరీనా సేఫ్టీ షీల్డ్' పేర్లతో కొత్త భద్రతా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. మారుతీ సుజుకీ తెలిపిన వివరాల ప్రకారం, నెక్సా, అరీనా మోడల్స్‌లో ఈ ప్యాకేజీల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్లు, ఈబీడీ సహా ఈబీఎస్ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ హోల్డ్ అసిస్ట్ తో కూడిన ఈఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), రివర్స్ పార్కింగ్ సిస్టమ్స్, త్రీ-పాయింట్ ఈఎల్ ఆర్ సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, పెడిస్ట్రియన్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక భద్రతా లక్షణాలు కలిగి ఉన్నాయి.
వివరాలు
వినియోగదారుల సందేహాలను తొలగించడం మా లక్ష్యం
అలాగే, మారుతీ సుజుకీ ఇటీవల 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటో-హోల్డ్ ఫీచర్ కలిగిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి ఆధునిక సాంకేతికతలతో కూడిన ఫీచర్లను కూడా తన కార్లలో ప్రవేశపెట్టుతోంది. మారుతీ సుజుకీ మార్కెటింగ్-సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, భద్రత సంస్థకు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత కలిగిందని తెలిపారు. "2024-25 ఆర్థిక సంవత్సరంలో, వాహన భద్రతను మెరుగుపరచడానికి గణనీయమైన చర్యలు చేపట్టాము. ఇప్పుడు అన్ని మోడల్స్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంది. అలాగే 14 మోడల్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్లు స్టాండర్డ్‌గా ఇచ్చాం," అని ఆయన వివరించారు.
వివరాలు
140కి పైగా వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్లను ప్రవేశపెట్టిన తొలి కంపెనీ
'సేఫ్టీ షీల్డ్' పేరుతో ప్యాకేజీని విడుదల చేయడంవల్ల, మారుతున్న వినియోగదారుల అవసరాలను ముందుగానే గుర్తించి, సాంకేతికంగా అభివృద్ధి చెందిన పరిష్కారాలను అందించడమే సంస్థ లక్ష్యమని బెనర్జీ అన్నారు. "140కి పైగా వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్లను ప్రవేశపెట్టిన తొలి కంపెనీ మేమే. ఇది గొప్ప పని, దాన్ని మేము సాధించాము. గతంలో మారుతీ వాహనాలు సురక్షితమా అనే సందేహం ఉండేది. ఇప్పుడు కేవలం ఆరు ఎయిర్‌బ్యాగ్లు కాకుండా, అరీనా, నెక్సా సేఫ్టీ షీల్డ్ లో భాగంగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తున్నాము. అర్థం ఏంటంటే మేము వినియోగదారులకు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో కూడిన వాహనాలను అందిస్తున్నాము. అందువల్ల వినియోగదారుల సందేహాలు తొలగించుకోవాలి," అని ఆయన చెప్పారు.