
Bharti Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీ ఎయిర్ టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందిస్తూ, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక ఆఫర్ కోసం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
ముఖ్యంగా పోస్ట్ పెయిడ్, వైఫై కస్టమర్లకు అదనపు స్టోరేజీ అందించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్, వైఫై యూజర్లకు ఆరు నెలల పాటు 100జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందిస్తుంది.
ఈ స్టోరేజ్‌ను ఐదుగురు వ్యక్తులతో పంచుకునే సదుపాయం కూడా ఉంది.
details
స్టోరేజ్ సేవ కొనసాగించాలంటే నెలకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో లాగిన్ అయిన అర్హులైన వినియోగదారులు ఈ లాభాలను పొందవచ్చు. ఆరు నెలల తర్వాత స్టోరేజ్ సేవ కొనసాగించాలంటే నెలకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
ఈ సేవలను గూగుల్‌తో కలిసి అందించడంపై ఎయిర్‌టెల్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక జియో కూడా తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై 50జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది.
Details
ఎక్కువ రీచార్జి చేసిన వారికి క్లౌడ్ స్టోరేజీ అందుబాటులోకి
రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జి చేసిన వారికి ఈ క్లౌడ్ స్టోరేజీ అందుబాటులో ఉంటుంది.
తక్కువ మొత్తంతో రీఛార్జి చేసినవారికి మాత్రం 5జీబీ డేటా ఫ్రీ ట్రయల్ రూపంలో లభిస్తుంది.
జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రూ.349, రూ.449, రూ.649, రూ.749, రూ.1549 రేంజ్‌లో క్లౌడ్ స్టోరేజీ సేవలు భాగంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
దీంతో భారతీ ఎయిర్‌టెల్, జియో క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాలను పెంచుతూ వినియోగదారులకు మరింత విలువైన సేవలను అందిస్తున్నాయి.