Page Loader
Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం 
'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం

Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే మరో అడుగు వేసింది. పప్పుల రాయితీని విస్తరించి, 'భారత్' బ్రాండ్ ద్వారా వీటిని అందించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో తృణధాన్యాలు,మసూర్‌ దాల్‌లను కూడా చేర్చారు.ఈరాయితీల కారణంగా ప్రజలకు ధరల పెరుగుదల నుంచి కొంతమేరకు ఉపశమనం లభించనుంది. రిటైల్‌ మార్కెట్‌లో ఈ ఉత్పత్తులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు. 'భారత్‌'బ్రాండ్‌ రెండో దశ ప్రారంభోత్సవం సందర్భంగా చనా కిలో ధరను రూ.58,మసూర్‌ దాల్ కిలో ధరను రూ.89గా నిర్ణయించామని తెలిపారు. ఈధరలు బఫర్‌ స్టాక్‌ నుండి సబ్సిడీతో అందించబడతాయని వివరించారు.ప్రభుత్వం సహకార సంఘాలకు 3లక్షల టన్నుల చనా,68 వేల టన్నుల మసూర్‌ దాల్‌ను కేటాయించింది.

వివరాలు 

ఈ ఉత్పత్తులు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్‌ స్టోర్లలో అందించేందుకు చర్యలు 

ఎన్‌సీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనీస్‌ చంద్ర జోసెఫ్‌ మాట్లాడుతూ, ప్రారంభంలో ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలలో పంపిణీని మొదలుపెడతామని తెలిపారు. వచ్చే పదిరోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులను రిటైల్‌ చేయాలని ప్రణాళిక వేసినట్లు వెల్లడించారు. చనాకు భారీ డిమాండ్‌ ఉన్నందున సబ్సిడీ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ ఉత్పత్తులను విస్తరించేందుకు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్‌ స్టోర్లతో చర్చలు జరుగుతున్నాయి. 'భారత్‌' బ్రాండ్‌ తొలి దశను కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించింది. ఆ దశలో బియ్యం, గోధుమ పిండితో పాటు పప్పులను రిటైల్‌ ధరలకు అందుబాటులోకి తెచ్చింది.