Sam Altman-Elon Musk: ఓపెన్ఏ ఐ కొనేందుకు మస్క్ భారీ ఆఫర్.. తిరస్కరించిన సామ్ ఆల్ట్‌మాన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వ్యాపారవేత్త,'ఎక్స్'అధినేత ఎలాన్ మస్క్ దృష్టి ఇప్పుడు కృత్రిమ మేధ సంస్థ 'ఓపెన్‌ఏఐ'పై పడింది.
గత కొంతకాలంగా ఈ సంస్థపై విమర్శలు చేస్తున్న మస్క్,తాజాగా దానిని కొనుగోలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు,అందుకోసం భారీ ఆఫర్ కూడా ఇచ్చారు.
ఓపెన్‌ఏఐని 97.4బిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ.8.5 లక్షల కోట్లు)కు కొనుగోలు చేస్తామని మస్క్‌తో పాటు మరికొందరు పెట్టుబడిదారులు ప్రకటించారు.
అయితే,ఈఆఫర్‌ను ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ బహిరంగంగానే తిరస్కరించారు.
దీనికి ప్రతిగా,అవసరమైతే 'ఎక్స్'నే కొనుగోలు చేస్తానంటూ మస్క్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
''మీ ఆఫర్‌కు నా సమాధానం'నో'.కానీ, మీరు అనుకుంటే ట్విటర్‌ను 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.85 వేల కోట్లు)మేమే కొనుగోలు చేస్తాం''అని ఆల్ట్‌మన్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సామ్ ఆల్ట్‌మాన్ చేసిన ట్వీట్
no thank you but we will buy twitter for $9.74 billion if you want
— Sam Altman (@sama) February 10, 2025