
Trumps Tariffs: భారత్‌కు డాలర్ ప్రమాదం.. పెరుగుతున్న బంగారం ప్రాధాన్యత
ఈ వార్తాకథనం ఏంటి
పరాయి సొమ్ము పాము వంటిది అని అంటారు, కానీ మనం సంపాదించిన డబ్బు ఇతర దేశాల వద్ద ఉంటే అది అనకొండలా మారి ఎప్పుడోకప్పుడు మన భవిష్యత్తును మింగేస్తుంది. ఈ పాఠం రష్యాకు బాగా తెలుసు..! ఉక్రెయిన్ యుద్ధ సమయంలో, అమెరికా, పశ్చిమ దేశాలు కోపానికి గురై, రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్ల రిజర్వులను స్తంభింపజేసాయి. భారత్, కొన్నాళ్ల నుంచి డాలర్లను కాకుండా బంగారాన్ని భారీగా కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు గణాంకాలు నిరూపిస్తున్నాయి. డాలర్లలోనే రిజర్వులను దాచడం సురక్షితం కాకపోవచ్చని కేంద్రం గమనించింది. ట్రంప్ టారిఫ్‌ల విధించడానికి ముందే భారత్ ఈ పథకాన్ని అనుసరించడం ప్రారంభించింది
వివరాలు
డాలర్ పెట్టుబడులు తగ్గింపు:
అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం, జూన్‌లో భారత్ ట్రెజరీ సెక్యూరిటీలలో పెట్టిన డాలర్ రిజర్వులు 227.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత నెలలో ఇవి 235.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో 242 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఆర్బీఐ విధానాలు: రిజర్వులను ఒక్కచోట కాకుండా వివిధ రూపాల్లో ఉంచే విధానాన్ని ఆర్బీఐ స్వీకరించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల ఇదే విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ వద్ద 694 బిలియన్ డాలర్ల రిజర్వులు ఉన్నాయి, ఇది ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రిజర్వు.
వివరాలు
ప్రపంచం కూడా బంగారం వైపే..
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గవచ్చని అంచనాలు ఉన్నా, ఇతర దేశాలు జూన్‌లో ట్రెజరీ సెక్యూరిటీలలో పెట్టుబడులను పెంచుకున్నాయి. అదే సమయంలో, డాలర్ రిస్క్ తగ్గించుకునేందుకు బంగారం కొనుగోళ్లు పెంచారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో అమెరికా రష్యాకు ఉన్న డాలర్ రిజర్వులను స్తంభింపజేశాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్టు గౌరవ్ కపూర్ తెలిపినట్లు, ఈ రిజర్వులు 330 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని బ్రూకింగ్స్ అంచనా వేసింది. రష్యా వంటి పెద్ద దేశాన్ని స్తంభింపజేసిన అమెరికా, ప్రపంచంలోని ఏ దేశానికి కూడా ఇదే చర్య చేయగలదనే భయం ఏర్పరిచింది. ఫలితంగా, చాలా కేంద్ర బ్యాంకులు డాలర్ రిజర్వులను తగ్గించడం ప్రారంభించాయి.
వివరాలు
ట్రంప్ కార్యవర్గం ఉద్రిక్త ప్రకటనలతో ప్రకంపనలు..
భారత్-అమెరికా మధ్య అభిప్రాయ భేదాలు ఆగస్టులో తీవ్ర స్థాయికి చేరాయి. ట్రంప్ కార్యవర్గం భారత దిగుమతులపై 50 శాతానికి టారిఫ్‌లు పెంచింది. ఆసియాలో అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దేశంగా భారత్ మారింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ ఇటీవల భారత్, చైనాని "చెడ్డ దేశాలు" అని, ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు అందిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాణిజ్య సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యల ప్రకారం,భవిష్యత్తులో భారత్ ట్రంప్‌కు క్షమాపణలు చెప్పి మాత్రమే డీల్ చేయగలదని చెప్పారు. అమెరికా లేకుండా దేశం ముందుకు వెళ్లలేమని అవగాహన కలిగిందని సూచించారు. సలహాదారు పీటర్ నవారో కూడా, రోజుకో కొత్త బెదిరింపు, ఆరోపణలతో మీడియా ముందుకు వస్తున్నారని తెలిపారు.
వివరాలు
భారత్‌కు ప్రమాద ఘంటికలు
ఒక దశలో, భారత్ డాలర్లతో రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. డాలర్ వినియోగానికి సంబంధించిన ఆంక్షలు విధిస్తే భారత్‌కు ఇబ్బందికరమే. మరోవైపు మన ఔట్ సోర్సింగ్, సాఫ్ట్‌వేర్ రంగాన్ని టార్గెట్ చేయాలని పదేపదే ట్రంప్ అనుచర వర్గం ప్రకటనలు చేస్తోంది. ఇవన్నీ భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
వివరాలు
భారీగా పెరుగుతున్న బంగారం నిల్వలు ..
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం,ఇటీవల బంగారం నిల్వలు గణనీయంగా పెరిగాయి. గతేడాది 841.5 టన్నులు ఉండగా, ఇప్పుడు 880మెట్రిక్ టన్నులకు చేరాయి. అలాగే, విదేశాల్లోని బంగారం నిల్వలను స్వదేశానికి తీసుకురావడం వేగవంతం చేశారు. 2020లో ఇవి 292 టన్నులు ఉండగా, ఇప్పుడు 512 టన్నులకు చేరాయి. గతేడాది ధన్‌తేరస్ సమయంలో, భారత్ 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తరలింపు జరిగింది. ఇంకా 300 టన్నులకు పైగా బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉంచారు, ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద గోల్డ్ రిజర్వ్ కేంద్రం. అవసరమైతే లండన్ బులియన్ మార్కెట్లో నగదు రూపంలో మార్చేందుకు కూడా వీలుగా ఉంచారు.
వివరాలు
ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ కీలక ప్రశ్నలు
ఇటీవల ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ మైఖెల్ పాత్రో రాసిన ఓ వ్యాసంలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. "విదేశాల్లో ఉంచిన బంగారం రిజర్వులను ఆంక్షలు,స్తంభింపులు లేదా జప్తు చేయడం సమయంలో దక్కించుకోవడం కష్టతరం అవుతుంది. అందువలన డాలర్ ఆధారపడటాన్ని తగ్గించి, ఆస్తులను వివిధ మార్గాల్లో నిల్వ చేయడం మంచిది" అని పేర్కొన్నారు. పాత్రో ఐదు సంవత్సరాలపాటు RBI లో సేవలు అందించారు. గవర్నర్ శక్తికాంత దాస్ యాజమాన్యంలో, భారత్ బంగారం కొనుగోలులో కీలక పాత్ర పోషించారు.