Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ
సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)లు మండే (Monday) టాప్ గేర్ లో పరుగులెత్తాయి. సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 1.28% పెరిగి 74,671.28 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 1% నుంచి కాస్త ముందుకు వెళ్లి 22,643.4 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.49% పెరిగి 14,153.05 పాయింట్లకు చేరుకోవడంతో మిడ్‌క్యాప్ సూచీలు కూడా లాభపడ్డాయి. టాప్ సెక్టార్ లో లాభపడిన కంపెనీలు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ వరుసగా 2.5%, 2.47%, 2.12% ఎగబాకి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంకులు, అల్ట్రాటెక్ సిమెంట్ వరుసగా 4.43%, 2.94% 2.88% లాభపడ్డాయి.
తగ్గిన రూపాయి విలువ
హెచ్ సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు వరుసగా 5.86%, 4.51%, 2.42% తో నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 3,113.04, నిక్కీ 37,934.76 పాయింట్లకు రెడ్ లో ట్రేడ్ అయ్యి పడిపోయాయి. హ్యాంగ్ సెంగ్ 0.54% నకు ముందుకు దూసుకెళ్లి 17,746.91 పాయింట్లకు చేరుకుంది. యూఎస్ లో నాస్ డాక్ (NASDAQ) గ్రీన్‌లో ట్రేడవుతోంది. ప్రస్తుతం 2.03% ముందుకెళ్లి 15,927.9 పాయింట్లకు చేరుకుంది. ఇక సోమవారం ఫారెక్స్ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి (INR) 0.13% తగ్గి ₹83.47కి చేరుకుంది. బంగారం భవిష్యత్తు ధరలు రూ.71,635 వద్ద ఉండగా, వెండి ధరలు 0.27% పెరిగి 80,898 రూపాయలకు చేరుకున్నాయి.