LOADING...
Stock Market: ట్రంప్ సుంకాల బాదుడు.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ట్రంప్ సుంకాల బాదుడు.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: ట్రంప్ సుంకాల బాదుడు.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారంతో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు మందకొడిగా ప్రారంభమయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా, భారత్ ఆ సూచనలను పట్టించుకోకపోవడం వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల భారం మోపారు. ఈ పరిణామం భారతీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్ 215 పాయింట్లు పడిపోయి 80,336 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 24,502 వద్ద ట్రేడవుతోంది. హీరో మోటోకార్ప్, ట్రెంట్, సిప్లా, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

ఏ షేర్లు ఎలా..? 

మరోవైపు,టాటా మోటార్స్,కొటక్ మహీంద్రా బ్యాంక్, జియో ఫైనాన్షియల్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. భారత దిగుమతులపై ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించిన ట్రంప్, వాటిని ఇప్పుడు 50 శాతానికి పెంచారు. ఈ మేరకు అదనంగా జరిమానా,సుంకాలుగా పేర్కొంటూ బుధవారం రోజున ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఇక తాజాగా ప్రకటించిన అదనపు 25 శాతం సుంకాలు ఈ నెల 27వ తేదీ నుండి అమల్లోకి రాబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మూడు పైసలు మెరుగు పడుతూ 87.69 వద్ద ప్రారంభమైంది, ఇది గమనించదగిన విషయం.