Page Loader
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800

Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో మార్కెట్‌ ఊపందుకుంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరగడం వల్ల సూచీలకు మద్దతు లభించింది. ఈ ప్రభావంతో ఉదయం 9:25 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 81,515 స్థాయికి చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 24,801 వద్ద ట్రేడవుతున్నది.

వివరాలు 

సెన్సెక్స్‌-30

సెన్సెక్స్‌-30లో చురుకైన షేర్ల విషయానికి వస్తే, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా షేర్లు మాత్రం నష్టాలతో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పరిస్థితి చూస్తే, బ్రెంట్ క్రూడ్‌ ఒక్కో బ్యారెల్‌ ధర 65.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర విషయంలో, ఔన్సు ధర 3,274 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

మరోవైపు, అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ సూచీ 0.51 శాతం పడిపోయింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.56 శాతం తగ్గగా, డోజోన్స్‌ ఇండెక్స్‌ 0.58 శాతం కోల్పోయింది. ఆసియా-పసిఫిక్‌ దేశాల స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో కదలాడుతున్నాయి. జపాన్‌ నిక్కీ సూచీ 1.68 శాతం పెరగగా, ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.34 శాతం లాభపడింది. అలాగే హాంగ్‌సెంగ్‌ 0.54 శాతం, షాంఘై సూచీ 0.71 శాతం పెరిగాయి. విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) బుధవారం నాడు నికరంగా రూ.4,663 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) కూడా నికరంగా రూ.7,912 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.