LOADING...
Stock Market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000+
భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000+

Stock Market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000+

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాల్లో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, సోమవారం మన మార్కెట్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1107 పాయింట్లు ఎగబాకి 81,704 వద్దకు చేరగా, నిఫ్టీ 361 పాయింట్లు పెరిగి 24,999 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.47 వద్ద నిలిచింది.

వివరాలు 

ఏ కంపెనీలు లాభాల్లో, ఎవరు నష్టాల్లో? 

హీరో మోటార్‌కార్ప్‌,మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం షేర్లు పాజిటివ్‌ వైపు కదులుతున్నాయి. అయితే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, లార్సెన్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌ స్టాక్స్‌ మాత్రం నష్టపోతున్నాయి. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళికల్లా జీఎస్‌టీ భారాన్ని తగ్గిస్తామని ప్రకటించడం స్టాక్‌మార్కెట్లకు కొత్త ఉత్సాహం కలిగించింది. మరోవైపు, మన దేశ క్రెడిట్‌ రేటింగ్‌ను 'బీబీబీ-' నుండి 'బీబీబీ'కి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పెంచడం మార్కెట్‌కు అనుకూలంగా మారింది.

వివరాలు 

అమెరికా విధించే సుంకాలపై కొంత ఊరట

అదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి వివరాలు బయటకు రాకపోయినా, సానుకూలంగా ముగిశాయని రెండు దేశాలు ప్రకటించాయి. ఈ చర్చల ఫలితంగా భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా విధించే సుంకాలపై కొంత ఊరట లభించవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.