Page Loader
Stock market crash: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి 
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి

Stock market crash: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా పై ట్రేడ్ టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రకటనతో సంబంధిత మార్కెట్లు కూలాయి, ముఖ్యంగా బ్లూచిప్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత తగ్గించాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1300 పాయింట్ల మేర నష్టపోయింది, అదే సమయంలో నిఫ్టీ 23,000 స్థాయిని కూడా కోల్పోయింది. కానీ చివర్లో సూచీలు కొద్దిగా కోలుకున్నాయి. బీఎస్‌ఈలో నమోదైన అన్ని కంపెనీల విలువ దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర తగ్గి రూ.424 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు 

సెన్సెక్స్ వాణిజ్య ప్రక్రియ 

సెన్సెక్స్ ఉదయం 77,261.72 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది (మునుపటి ముగింపు 77,073.44), కానీ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. సూచీ ఒక దశలో 700 పాయింట్ల మేర కోల్పోయింది. చివర్లో సూచీ 75,838.36 వద్ద 1235 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ కూడా 320 పాయింట్ల నష్టంతో 23,024.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.58గా ఉంది. లాభాలు,నష్టాలు సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్‌ షేర్లు మినహా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. జొమాటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం 

అంతర్జాతీయ విపణిలో, బ్రెంట్ క్రూడ్ 79 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2732.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నష్టాలకు కారణాలు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో పై 25% సుంకాలు విధిస్తామని ప్రకటించడం, మార్కెట్‌లో ఆందోళనలకు దారితీసింది. ఇతర దేశాలపై కూడా ట్రంప్ సుంకాలు విధిస్తానని ఇటీవల పేర్కొన్నారు, దీంతో మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది. జొమాటో ఫలితాలు: నిన్నటి త్రైమాసిక ఫలితాలతో నిరాశ పడిన జొమాటో, ఈ రోజు 11% వరకు నష్టపోయింది. ఇది మార్కెట్‌ను దెబ్బతీసింది.

వివరాలు 

నష్టాలకు కారణాలు

విదేశీ మదుపర్లు: అమెరికాలో డాలరు, బాండ్ యీల్డ్స్ పెరగడంతో, విదేశీ సంస్థాగత మదుపర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుండి అమ్మకాలు చేపట్టారు. జనవరి నెలలో సుమారు రూ.50,000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి, ఇది సూచీల కూలడికి కారణమైంది. త్రైమాసిక ఫలితాలు: ప్రస్తుతం వెలువడుతున్న మూడో త్రైమాసిక ఫలితాలు కూడా నిరాశాజనకంగా ఉండడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీసింది. బడ్జెట్ అంచనాలు: ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో వినియోగాన్ని పెంచేందుకు, తయారీని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాలని అంచనాలు ఉన్నాయి. దీంతో, బడ్జెట్‌కు ముందు మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.