Tesla SpaceX Merger: టెస్లాతో స్పేస్‌ఎక్స్ విలీనం.. డిసెంబర్‌లోనే సంచలన ప్రకటన?
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయా? బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రెండు సంస్థలు తమ వ్యాపారాల విలీనంపై అడ్వాన్స్‌డ్ దశలో చర్చలు జరుపుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లోనే ఈ భారీ డీల్‌పై ప్రకటన రావచ్చు. చర్చలు మరింత సమయం తీసుకుంటే 2027 ప్రారంభానికి కూడా వెళ్లే అవకాశం ఉంది.
Details
మస్క్ వ్యాపారాలన్నీ ఒకే వేదికపై
ఈ విలీనం జరిగితే ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక మార్పు కనిపించనుంది.
టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, ఎనర్జీ స్టోరేజ్ వ్యాపారాలతో పాటు స్పేస్‌ఎక్స్ రాకెట్లు, స్టార్‌లింక్ వంటి శాటిలైట్ కార్యకలాపాలు ఒకే కార్పొరేట్ నిర్మాణంలోకి వచ్చే అవకాశం ఉంది.
రెండు సంస్థల బలాలను కలిపి భవిష్యత్ టెక్నాలజీలపై మరింత వేగంగా పనిచేయాలన్న ఆలోచన ఈ చర్చల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.
Details
అసలు టార్గెట్ ఏఐ
ఈ ప్రతిపాదిత కలయికలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషించనుంది.
అంతరిక్ష కార్యకలాపాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, హ్యూమనాయిడ్ రోబోట్లు వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు రెండు సంస్థల సామర్థ్యాలను కలపాలన్నది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇప్పటికే టెస్లా, స్పేస్‌ఎక్స్ మధ్య వాణిజ్య సంబంధాలు ఉండటంతో ఈ సహకారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
Details
జాతీయ భద్రతే పెద్ద సవాలు
అయితే ఈ డీల్‌కు అడ్డంకులు కూడా తక్కువగా లేవు. అమెరికా ప్రభుత్వంతో స్పేస్‌ఎక్స్‌కు ఉన్న సున్నితమైన అంతరిక్ష, రక్షణ ఒప్పందాలు ఒకవైపు ఉండగా.. టెస్లాకు చైనాలో భారీ తయారీ కార్యకలాపాలు మరోవైపు ఉన్నాయి.
ఈ రెండు అంశాలు అమెరికా జాతీయ భద్రతా కోణంలో పరిశీలనకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో రాజకీయంగానూ ఈ విలీనంపై చర్చ పెరిగే అవకాశం ఉంది.
Details
విలీనంపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు
ఇప్పటికే అక్టోబర్‌లో టెస్లా, స్పేస్‌ఎక్స్ బోర్డులు స్వతంత్ర డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విలీన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు.
ఈ లావాదేవీలో టెస్లా షేర్‌హోల్డర్లకు స్పేస్‌ఎక్స్ ఎన్ని షేర్లు ఇవ్వాలనే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి.
ఈ చర్చలు ఫలిస్తే కార్పొరేట్ ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉంది.