Page Loader
UPI new rules:యూపీఐ యాప్‌ల ద్వారా లోన్లు.. ఎన్‌పిసిఐ మార్గదర్శకాలు విడుదల.. 2025 ఆగస్టు 31న ప్రారంభం
ఎన్‌పిసిఐ మార్గదర్శకాలు విడుదల.. 2025 ఆగస్టు 31న ప్రారంభం

UPI new rules:యూపీఐ యాప్‌ల ద్వారా లోన్లు.. ఎన్‌పిసిఐ మార్గదర్శకాలు విడుదల.. 2025 ఆగస్టు 31న ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో త్వరలోనే మరో పెద్ద మార్పు జరగనుంది. ఇప్పటివరకు కేవలం చెల్లింపుల కోసం ఉపయోగించే యూపీఐ (UPI) ను ఇకపై రుణాలు పొందేందుకు, ఖర్చు చేయడానికి కూడా వినియోగించుకోవచ్చని వెల్లడిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) తమ వినియోగదారులకు ఫోన్‌ పే, పేటియం, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా రుణాలు పొందే సౌకర్యాన్ని అందించనున్నాయి. ఈ విధానాన్ని 2025 ఆగస్టు 31లోపు అమలులోకి తీసుకురావాలని NPCI స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

యూపీఐ ద్వారా పొందవచ్చిన రకాల రుణాలు ఇవే: 

ఇప్పటి వరకు యూపీఐ సేవలు కేవలం రూపే క్రెడిట్ కార్డులు లేదా ముందుగా ఆమోదించిన కొన్ని రకాల రుణాలకే పరిమితంగా ఉండేవి. అయితే తాజా మార్పుతో యూపీఐలో అనేక రకాల రుణాలను కూడా లింక్ చేసే అవకాశం కలిగింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పై తీసుకునే లోన్ బంగారం (Gold) పై తీసుకునే లోన్ భూమి, ఇల్లు వంటి ఆస్తులపై తీసుకునే లోన్ షేర్లు, బాండ్ల వంటి పెట్టుబడులపై ఆధారపడిన లోన్ వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం తీసుకునే లోన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా పొందే వ్యవసాయ రుణం

వివరాలు 

పూర్తి ప్రక్రియ ఇలా ఉంటుంది: 

ముందుగా మీ బ్యాంకు లేదా ఎన్‌బిఎఫ్‌సి ద్వారా ఎఫ్‌డీ, బంగారం, ఆస్తి లేదా ఏదైనా పెట్టుబడిపై రుణం తీసుకోండి. తర్వాత మీ ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ క్రెడిట్ లైన్‌ను లింక్ చేయాలి. బ్యాంకు లేదా రుణ సంస్థ అనుమతినివ్వగానే మీ లోన్ ఖాతాను యూపీఐతో లింక్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ రుణానికి అనుగుణంగా చెల్లింపులు చేయగలరు లేదా డబ్బును బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానంలో రోజుకు రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన వారికైనా డబ్బు పంపించవచ్చు. నెలవారీగా రూ.50,000 వరకు ఉన్న పరిమితిలో చిన్న షాపుల వద్ద కొనుగోళ్లు చేయవచ్చు.

వివరాలు 

కానీ, కొన్ని నియమాలు ఉంటాయి: 

బ్యాంకు తన ఆమోదంతో, లోన్ షరతులను బట్టి ప్రతి లావాదేవీని తనిఖీ చేస్తుంది. ఉదాహరణకు మీరు బంగారం పై తీసుకున్న లోన్‌ను ఇతర అవసరాలకు ఖర్చు చేయడం సాధ్యపడదు. బ్యాంకులు తమ స్వంతంగా పరిమితులు, కేటగిరీలు కూడా నిర్ణయిస్తాయి. దీని వల్ల మీకు లభించే ప్రయోజనాలు ఏమిటి? తక్షణ సౌకర్యం: బ్యాంకు వెనక్కి వెళ్ళకుండానే యాప్ ద్వారానే రుణాన్ని ఉపయోగించవచ్చు. మొత్తం వ్యవహారం పూర్తిగా క్యాష్‌లెస్,పేపర్‌లెస్‌గా జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండానే తక్కువ సమయంలో లావాదేవీ పూర్తి చేయవచ్చు. ఈ విధానం వ్యాపారానికి ఎంతో ఉపయోగపడుతుంది. గ్రామాలు, పట్టణాలు అన్నీ ప్రాంతాల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రైతులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా చెల్లింపులు చేయగలుగుతారు.

వివరాలు 

అయితే, కొన్ని పరిమితులు ఉన్నాయి: 

రుణం పొందిన ముఖ్య ఉద్దేశ్యానికే ఆ డబ్బును ఉపయోగించాలి. రూ.1 లక్ష వరకు ఉన్న పరిమితితో పాటు, రోజుకు 20 లావాదేవీల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి బ్యాంకు, NBFC తమ విధానాలను బట్టి ఈ సేవను అందిస్తుంది. ఉదాహరణకు, వైద్య రుణం తీసుకున్నవారు దానిని బంగారం కొనుగోలుకు ఉపయోగించలేరు. అలాగే, బిజినెస్ రుణాల ద్వారా వ్యర్థ ఖర్చులు, లేదా జూదం వంటి చట్ట విరుద్ధ ప్రయోజనాల కోసం డబ్బును వినియోగించలేరు.