AA22xA6: కళ్లు చెదిరే రేటుకి 'ఏఏ22xఏ6' ఓటీటీ రైట్స్.. అల్లు అర్జునా .. మజాకా..
ఈ వార్తాకథనం ఏంటి
భారత సినీ పరిశ్రమలో అత్యంత పెద్దగా,ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన ఏఏ22xఏ6 ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే,ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారిగా ప్రముఖ దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ భారీ చిత్రంలో కథానాయికగా బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె ఎంపిక కావడం మరో ఆకర్షణ. షెడ్యూల్స్ అప్‌డేట్ తాజాగా జరిగిన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.ఆ షెడ్యూల్‌లో ఒక ఎనర్జీతో నిండిన పాటను చిత్రీకరించారు. ఇకపై వచ్చే అక్టోబర్ నెలలో అబుదాబిలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.ప్రత్యేకంగా లివా డెజర్ట్ ప్రాంతంలో చిత్రీకరణ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అక్కడ అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించేలా బృందం సన్నాహాలు చేస్తోంది.
వివరాలు
ఓటీటీ హక్కులపై నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి
ఈ ప్రాజెక్ట్ చుట్టూ మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. నెట్‌ఫ్లిక్స్ క్రియేటివ్ కంటెంట్ ఆఫీసర్ బెలా బజారియా తన బృందంతో కలిసి అల్లు అర్జున్, అట్లీ, నాని, నిర్మాతలు అల్లు అరవింద్, నాగ వంశిలను కలిసిన విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశం సాధారణ చర్చ కాదని, ముఖ్యంగా ఏఏ22xఏ6 ఓటీటీ హక్కులపై చర్చ జరిగిందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వివరాలు
భారీ మొత్తంలో డీల్
సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోవడానికి భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ఖచ్చితమైన ఆర్థిక వివరాలు బయటకు రాకపోయినా, ఈ డీల్ స్థాయి చూస్తే సినిమా ప్రాధాన్యత ఎంత వుందో అర్థమవుతోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
వివరాలు
రికార్డు స్థాయి బడ్జెట్
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్గా నిలుస్తుందని భావిస్తున్నారు. సంగీతం అందిస్తున్న సాయి అభ్యంకర్ తన ప్రత్యేకమైన బాణీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం సన్ పిక్చర్స్ సంస్థ ఏకంగా ₹800 కోట్ల బడ్జెట్ కేటాయించిందని టాక్. భారీ కాస్ట్, క్రూ, అత్యుత్తమ ప్రొడక్షన్ విలువలతో రూపొందుతున్న ఏఏ22xఏ6, ఈ ఏడాది తెలుగు సినీ రంగంలో అత్యధికంగా చర్చించబడే ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం.