
Flood Relief Fund: పాపులారిటీతో పాటు హీరోయిన్లకు బాధ్యత కూడా ఉండాలి.. అనన్య నాగళ్ళ, స్రవంతిపై ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు చెప్పొచ్చు. ఈ రాష్ట్రాల్లో వరదలు రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇప్పటికే హీరోలు తమ వంతుగా కోట్లలో విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి ప్రముఖులు ఈ జాబితాలో ముందున్నారు. మరి, హీరోయిన్లు మాత్రం ఇప్పటివరకూ స్పందించకపోవడం శోచనీయం.
కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఆమాత్రం సాయం చేయడం లేదని నెటిజన్లు హీరోయిన్లను ఉద్ధేశించి కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటివరకు అనేకమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వంతుగా లక్షలు, కోట్లు విరాళంగా ప్రకటించారు.
Details
స్పందించని టాలీవుడ్ హీరోయిన్లు
కానీ టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ స్పందించలేదు.
సమంత, రష్మిక మందన్నా, తమన్నా భాటియా వంటి ప్రముఖ హీరోయిన్లు ఒక రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు.
టాలీవుడ్ హీరోయిన్లు సిగ్గుపడేలా విధంగా అనన్య నాగళ్ళ, యాంకర్ స్రవంతి తమ వంతు సాయం చేశారు.
అనన్య రెండు రాష్ట్రాలకు 2.5 లక్షలు విరాళంగా ప్రకటించగా, స్రవంతి రెండు రాష్ట్రాలకు రూ. లక్ష విరాళం అందించారు.