Page Loader
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు.. 1,000 పేజీల చార్జిషీట్ దాఖలు 
సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు.. 1,000 పేజీల చార్జిషీట్ దాఖలు

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు.. 1,000 పేజీల చార్జిషీట్ దాఖలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడికి వ్యతిరేకంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. 2025 జనవరిలో ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విచారణలో నిందితుడిగా షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు దాదాపు వెయ్యి పేజీలకు పైగా ఛార్జ్‌షీట్‌ను సిద్ధం చేసి బాంద్రాలోని స్థానిక కోర్టులో దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, నిందితుడి ఎడమచేతి వేలిముద్రల వివరాలు, దాడి సమయంలో సైఫ్ శరీరంలో ఇరుక్కుపోయిన కత్తి ముక్కలు వంటి కీలక సాక్ష్యాలను చేర్చారు.

వివరాలు 

సైఫ్‌కు ఛాతీ, వెన్నెముక వద్ద తీవ్ర గాయాలు 

జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో దుండగుడు బాంద్రాలోని సైఫ్ నివాసంలోకి చొరబడి,ఆయన కుమారుడి గదిలోకి వెళ్తుండగా సైఫ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో సైఫ్‌కు ఛాతీ, వెన్నెముక వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించగా, అక్కడ శస్త్రచికిత్స అనంతరం కోలుకున్నారు. దాడి సమయంలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్, పిల్లలు ఇంట్లోనే ఉండటం మరో ఆందోళనకర విషయం.

వివరాలు 

ముంబయికి వచ్చేముందు, షరీఫ్ కోల్‌కతాలో..

ఈ ఘటన చోటుచేసుకున్న భవనం 12 అంతస్తులది కాగా, సైఫ్ కుటుంబం నాల్గో అంతస్తులో నివసిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటనా స్థలంలో లభించిన కత్తి ముక్కలను, నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధంతో సరిపోల్చగా, అవి ఒకటేనని నిర్ధారణకు వచ్చారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం బంగ్లాదేశ్‌కు చెందినవాడిగా గుర్తించగా, అతడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్టు స్పష్టమైంది. ముంబయికి వచ్చేముందు, షరీఫ్ కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు.