Jeetendra Madnani: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో బెంగాల్ హీరో .. రీమేక్ చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నఈ బెంగాల్ హీరో ఎవరో తెలుసా?
సూపర్ హిట్ అయిన మూవీని వేరే ఇండస్ట్రీలో రీమేక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణం. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువవడంతో సీఎంలను రీమేక్‌లు చేసే అవకాశం తక్కువగా ఉంది. కానీ గత రెండు దశాబ్దాల నుండి ఇప్పటికీ వరకు టాలీవుడ్ సినిమాలను వరుసగా రీమేక్ చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు బెంగాలి హీరో జితేంద్ర మద్నానీ ఉరఫ్ జిత్.. ఈ హీరో రీమేక్ చేయని తెలుగు సినిమా లేదంటే మనకి ఆశ్చర్యం కలగక మానదు.
ఇండియాకి జిత్ ఓ రీమేక్ కింగ్
జితేంద్ర మద్నానీ (జిత్) సినిమాలంటే బెంగాలి వాళ్ళు పిచ్చ పిచ్చగా ఖుషి అవుతారు. ఎందుకంటే బెంగాలీ ఇండస్ట్రీలో అయన ఓ స్టార్ హీరో. అంతేకాదు పెద్ద నిర్మాత, సింగర్, బిజినెస్ మ్యాన్, టీవీ యాంకర్ కూడా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయనకి రెెండు మూడూ సినీ నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదూ , ఎందుకంటే ఈయనకి టాలీవుడ్‌తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సింపుల్‌గా చెప్పాలంటే బెంగాలి వాళ్ళకి అయన ఓ స్టార్ హీరో కావొచ్చు కానీ ఇండియాకి మాత్రం ఈయన ఓ రీమేక్ కింగ్. అదేంటో ఇప్పుడు చూద్దాం.
రీమేక్ చేయడం జిత్‌కి వెన్నతో పెట్టిన విద్య
ఏ వుడ్ లో ఏ సినిమా హిట్ హిట్ అయినా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోగా ఆ సినిమాని బెంగాల్‌లో రీమేక్ చేయడం జిత్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు ఈయన రీమేక్స్ చేసిన సినిమాల లిస్ట్ వింటే మీరు నోరెళ్లబెట్టక మానరు. ముందుగా జిత్ రీమేక్ చేసిన టాలీవుడ్ సినిమాలు ఏంటో చూద్దాం. తెలుగు సూపర్ డూపర్ హిట్ అయిన తమ్ముడు, నీ స్నేహం, సత్యం, మన్మథుడు, శివ, ఒక్కడు, అతడు, గమ్యం, కృష్ణ, భద్ర, బిజినెస్ మ్యాన్, పవర్, లౌక్యం, డాన్ శీను, అత్తారింటికి దారేది, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది.
బెంగాలీ 'నాన్నకు ప్రేమ'తో సినిమా సూపర్ హిట్
ఇకపోతే టాలీవుడ్ హీరోలలో జిత్ ఎక్కువగా రీమేక్ చేసిన సినిమాలు ఎవరివంటే ..మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ సినిమాలు. జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో వచ్చిన' నాన్నకు ప్రేమ'తో సినిమాను కూడా రీమేక్ చేసిన జిత్ సూపర్ హిట్ కొట్టేశారు . భారతదేశంలోని సినిమా ఇండస్ట్రీలలో ఇన్ని చిత్రాలను రీమేక్ చేసిన హీరో మరొకరు లేరేమో.
మన హీరోలు చేసే యాక్షన్ ని జిత్ చేస్తే కామెడీ
టాలీవుడ్ ఆడియన్స్ కి జిత్ తెలియకపోయిన కూడా అతడిని మన వాళ్ళు ట్రోలింగ్ పేజీలు, మీమ్స్‌ల్లో తెగ వాడుతూ ఉంటారు. జిత్ రీమేక్ చేసిన తెలగు సినిమాల్లోని కొన్ని సీన్లను ట్రోలింగ్ లేదా తెలుగు సినిమా నటులతో పోలిక కోసం కొన్ని బెంగాలీ క్లిప్ లను సోషల్ మీడియాలో వాడుతుండడంతో తెగ వైరల్ అవుతుంటాయి. మన హీరోలు చేసిన యాక్షన్ ని జిత్ చేస్తే మనోళ్లకి కామెడీగా అనిపిస్తుంది. కానీ బెంగాల్‌లో ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక జిత్ టాలీవుడ్ సినిమాలనే రీమేక్ చేయలేదు ,కోలీవుడ్ లో సూర్య నటించిన సింగం సిరీస్‌ను కూడా అక్కడ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు జిత్.
తెలుగు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం
ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే అసలు జిత్ సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిందే ఓ తెలుగు సినిమాతో. 2001లో వచ్చిన 'చందు' అనే తెలుగు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగు సినిమా పై అభిమానంతోనే టాలీవుడ్ లో ఏ సినిమా రిలీజైన అవి చూసి నచ్చిన ఒక వేళ నచ్చితే ఆ సినిమాలను బెంగాల్ లో రీమేక్ చేసి అక్కడి ఆడియన్స్ మనసులు గెలుచుకుంటున్నారు.