NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tollywood:నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది 
    తదుపరి వార్తా కథనం
    Tollywood:నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది 
    నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం

    Tollywood:నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    08:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు.

    ఈ సమావేశం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగుతుంది.

    సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

    ప్రభుత్వ తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ పాల్గొననున్నారు.

    ఈ సమావేశంలో సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.

    ముఖ్యంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, గద్దర్ అవార్డుల పరిశీలన, ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

    వివరాలు 

    నిర్మాతల నుంచి: 

    ఈ సమావేశంలో దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ, చినబాబు, నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ తదితరులు పాల్గొననున్నారు.

    హీరోల నుంచి:

    మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.

    దర్శకుల సంఘం నుంచి:

    దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్లు సాయి రాజేష్, విశ్వంభర దర్శకుడు వశిష్ట, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ వంటి ప్రముఖులు పాల్గొంటారు.

    వివరాలు 

    తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి: 

    తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ చౌదరి, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ హాజరుకానున్నారు.

    మా అసోసియేషన్ నుంచి:

    తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుండి పలువురు ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    రేవంత్ రెడ్డి

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    టాలీవుడ్

    Mohan Babu: హెల్త్ బులెటిన్.. మోహన్ బాబు ఎడమ కంటికి గాయం  సినిమా
    Year Ender 2024: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్.. అవేంటంటే?  సంవత్సరం ముగింపు 2024
    Manchu Manoj: 'మంచు' ఫ్యామిలీ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు మంచు మనోజ్
    Jayathi :డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్‌తో అభిమానుల మనుస్సు దోచిన వెన్నెల జయతి సినిమా

    రేవంత్ రెడ్డి

    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం తెలంగాణ
    Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం  తెలంగాణ
    Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్‌ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం తెలంగాణ
    Race Course: మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌ స్థలానికి ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ? హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025