NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే ..కీలక సమాచారం ఇచ్చిన నిర్మాతలు 
    తదుపరి వార్తా కథనం
    Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే ..కీలక సమాచారం ఇచ్చిన నిర్మాతలు 
    కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

    Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే ..కీలక సమాచారం ఇచ్చిన నిర్మాతలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టించిన చిత్రం "కల్కి 2898 AD." యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా,డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో థియేటర్లలో సందడి చేసింది.

    ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ‍అశ్వినీదత్‌ నిర్మించారు.

    భారీ అంచనాల మధ్య జూన్27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1200కోట్ల పైగా వసూలు చేసింది.

    ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్,కమల్ హాసన్,విజయ్ దేవరకొండ,శోభన,మాళవిక నాయర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

    మలయాళం,తమిళం,హిందీ,కన్నడ ఇండస్ట్రీల నుండి పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

    వివరాలు 

    కల్కి 2 గురించి తాజా అప్డేట్స్

    మహాభారతం ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈసైన్స్ ఫిక్షన్ మూవీ సీనీ ప్రియులను విపరీతంగా ఆకర్షించింది.

    డైరెక్టర్ మేకింగ్, ప్రభాస్ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ మూవీకి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో కల్కి 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ రష్యాలోని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ లో పాల్గొన్నారు. అక్కడ వారు కల్కి 2 గురించి కొన్ని తాజా అప్డేట్స్ అందించారు.

    జనవరి, ఫిబ్రవరిలో సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత, పార్ట్ 2 గురించి మరిన్ని వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.

    వివరాలు 

    కల్కి 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా..

    ప్రియాంకదత్ మాట్లాడుతూ.. కల్కి విడుదల సమయంలో ఎన్నో ప్రశంసలు అందాయని, ప్రపంచం నలుమూలల నుండి మెసేజ్ లు వచ్చాయని, వారు స్వచ్ఛందంగా సినిమాను ప్రచారం చేశారని చెప్పారు.

    కాగా, కల్కి సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా జరగలేదు, ప్రస్తుతం వాట్సాప్ లో మాత్రమే వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

    కల్కి 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్‌ హింట్ ఇవ్వడంతో పార్ట్‌-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    కల్కి 2898 AD

    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  ప్రభాస్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  అమితాబ్ బచ్చన్
    Prabhas: ప్రభాస్ 'కల్కి' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025