
Kingdom Collections Day 1: కింగ్‌డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసుకున్న విజయ్ దేవరకొండ, తాజాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "కింగ్‌డమ్"తో ప్రేక్షకులను పలకరించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను సంపాదించింది. ఈసారి తొలిసారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించిన విజయ్ అభిమానుల్లో అసలైన ఉత్సాహాన్ని నింపాడు. ఈ హైపుతో బాక్సాఫీస్ వద్ద "కింగ్‌డమ్" కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ ను కుమ్మేశాడు. కాగా, ఫస్ట్ డే ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో డే 1 కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే…
ట్రేడ్ వర్గాల ప్రకారం, "కింగ్‌డమ్" తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన వసూళ్లు సాధించింది. తెలంగాణలోని నైజాం ప్రాంతంలో ఈ సినిమా రూ. 4.20 కోట్ల షేర్ అందుకోగా, రాయలసీమ (సీడెడ్)లో రూ. 1.70 కోట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర నుంచి రూ. 1.16 కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. 75 లక్షల షేర్ రాగా, తూర్పు గోదావరిలో రూ. 74 లక్షలు వసూలయ్యాయి. పశ్చిమ గోదావరి నుంచి రూ. 44 లక్షల షేర్ వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ చిత్రం రూ. 59 లక్షల షేర్ రాబట్టగా, నెల్లూరు జిల్లాలో రూ. 34 లక్షల వసూళ్లు వచ్చాయి.
వివరాలు
మొత్తం వసూళ్లపై ఓ లుక్…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి "కింగ్‌డమ్" తొలి రోజు మొత్తం రూ.9.92 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు సమాచారం. గ్రాస్ కలెక్షన్లు రూ. 18 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంటే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 8 కోట్లకు మించే గ్రాస్ వచ్చినట్టు భావిస్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే... ఈ సినిమా విజయవంతంగా నిలవాలంటే మొత్తం రూ. 53.50 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. స్టార్ట్ మంచి టాక్‌తో మొదలైన ఈ మూవీ, వారం చివరికి ఇంకెన్ని కలెక్షన్లను అందుకుంటుందో వేచి చూడాలి. వీకెండ్ బాక్సాఫీస్ డిసైడ్ చేయనుంది.