Page Loader
Kuberaa: 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్‌ వాయిదా.. సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన చిత్ర బృందం 
'కుబేర' సినిమా ప్రీ రిలీజ్‌ వాయిదా.. సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన చిత్ర బృందం

Kuberaa: 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్‌ వాయిదా.. సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన చిత్ర బృందం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జున, ధనుష్, రష్మిక ముఖ్యపాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కుబేరా'. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాదులో నిర్వహించనున్నట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఘటనపై సంతాపం తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన 'కుబేరా' సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

వివరాలు 

'కన్నప్ప' ఈవెంట్‌ పోస్ట్‌పోన్‌ 

ఇక మరోవైపు 'కన్నప్ప' చిత్రం కూడా విమాన ప్రమాద ప్రభావంతో తన ప్రమోషన్ కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ఇప్పటికే నటుడు మంచు విష్ణు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ఈవెంట్ మరియు ట్రైలర్ విడుదల వేడుకలను శుక్రవారం ఇండోర్‌లో జరపాలని చిత్ర బృందం ప్రణాళిక వేసింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో, బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.