
Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో చేరిన స్టార్ నటుడు.. మహేశ్ తండ్రిగా మాధవన్?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం గురించి ఓ రూమర్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ స్థాయి ప్రాజెక్టులో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయంగా వినిపిస్తున్న కథనాల ప్రకారం, మాధవన్ ఈ సినిమాలో మహేశ్ బాబుకు తండ్రిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం నానా పటేకర్, విక్రమ్ వంటి ప్రముఖ నటుల పేర్లను పరిశీలించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
వివరాలు
రాజమౌళి మార్క్ యాక్షన్ ఘట్టాలతో ఈ షెడ్యూల్
ఇప్పటికే ఒడిశా, హైదరాబాద్‌లలో కొన్ని ముఖ్యమైన షెడ్యూల్‌లను పూర్తి చేసిన చిత్రబృందం, తాజా షెడ్యూల్‌ను కెన్యాలో ప్రారంభించింది. అక్కడి అంబోసెలీ నేషనల్ పార్క్‌తో పాటు పలు అడవీ ప్రాంతాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్‌లను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందుకోసం అవసరమైన అన్ని అధికారిక అనుమతులను చిత్ర యూనిట్ ఇప్పటికే పొందినట్లు తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ ఘట్టాలతో ఈ షెడ్యూల్ సాగనుందని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందిందని,ఇది ఒక ప్రపంచయాత్రలాగా సాగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామాయణంలో ఉన్న 'సంజీవని' అంశం నుంచి ప్రేరణ పొందిన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
వివరాలు
రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్ర నిర్మాణం
ఇందులో మహేశ్ బాబును ఇప్పటి వరకు కనిపించని సరికొత్త గెటప్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా డైనోసార్ వేట వంటి ఆసక్తికరమైన అంశాలు కూడా సినిమాలో భాగమవుతాయని బాలీవుడ్ వర్గాల టాక్. ఈ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 2027లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రాజమౌళి చిత్రాన్ని రూపొందిస్తున్నారు.