ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు
ఈ వారం సినిమా ప్రేమికులకు మంచి ఆసక్తిగా ఉండనుంది. వేరు వేరు జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే విభిన్నమైన కంటెంట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ఏంటో చూద్దాం. థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి: నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం, మార్చ్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. కబ్జా: కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న ఈ చిత్రం, పాన్ ఇండియా రేంజ్ లో మార్చ్ 17న విడుదలవుతోంది.
ఓటీటీ లో విడుదలవుతున్న సినిమాలు
సత్తిగాని రెండెకరాలు: పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం, ఆహా లో మార్చ్ 17నుండి అందుబాటులోకి వస్తుంది. రైటర్ పద్మభూషణ్: యాక్టర్ సుహాస్ నటించిన ఈ చిత్రానికి థియేటర్ల దగ్గర మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ రెడీ అయ్యింది. మార్చ్ 17వ తేదీన జీ5 లో విడుదల అవుతుంది. సార్: ఈ సినిమాతో తమిళ నటుడు ధనుష్, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. నెట్ ఫ్లిక్స్ లో మార్చ్ 17నుండి అందుబాటులో ఉండనుంది. ద వేల్: ఇందులో నటించిన బ్రెండన్ ఫ్రేజర్ కు ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. సోనీ లివ్ లో మార్చ్ 16నుండి స్ట్రీమింగ్ అవుతుంది.