
Netflix: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సేవలకు అంతరాయం.. లాగిన్‌లో సమస్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఈ సేవల్లో విఘాతం ఏర్పడటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు అనేక సమస్యలకు లోనవుతున్నారు.
ముఖ్యంగా లాగిన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే కొన్ని గంటలుగా ఈ సమస్య కొనసాగుతోందని వార్తలు వచ్చాయి.
అమెరికాలోని న్యూయార్క్, చికాగో,డలాస్,లాస్ ఏంజెలెస్ నగరాల్లో ఈ సేవల్లో అంతరాయం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అక్కడి యూజర్లు తమ సమస్యలను సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేస్తున్నారు.
లాగిన్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తోందని,ఖాతాలను ఓపెన్ చేయలేకపోతున్నామని వారు చెబుతున్నారు.
"కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి"అనే సందేశం మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తోందని పేర్కొంటూ,దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు.
వివరాలు
తీవ్రంగా శ్రమిస్తున్న నెట్‌ఫ్లిక్స్ సాంకేతిక బృందం
ఇంతేకాకుండా, మరికొంతమంది యూజర్లు మరొక రకమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
తమకు చెందిన ప్రొఫైల్‌లో వీక్షించిన కంటెంట్ జాబితా వేరే ప్రొఫైల్‌లో కనబడుతోందని, ఇది 'ప్రొఫైల్ మిస్‌మ్యాచ్' సమస్యగా భావిస్తున్నామని తెలిపారు.
అనేక మంది యూజర్లు వీటిని గమనించి కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఇబ్బందుల నేపథ్యంలో, యూజర్లకు కలిగిన అసౌకర్యాలను తొలగించేందుకు నెట్‌ఫ్లిక్స్ సాంకేతిక బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న ఆదరణ ఏ మేరలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2025 నాటికి నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుల సంఖ్య 300 మిలియన్లకు చేరింది.
ఇందులో కేవలం అమెరికాలోనే 81 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.
ఈ స్థాయి వినియోగదారుల వేదికలో ఒక్క సమస్య తలెత్తినా,అది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లకు తీవ్రమైన అసౌకర్యంగా మారుతోంది.
తాజా సమస్య కూడా అలాంటి ఒక ఉదాహరణగా మారింది.