
Pushpa The Rule -Cinema: పుష్ప ద రూల్...టీజర్ రిలీజ్ తోనే నిరూపించేస్తున్నాడు
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే ట్రీట్ గా ఈ నెల 8న విడుదలైన పుష్ప 2 సినిమా టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది.
పుష్ప 2 టీజర్ (Teaser) యూట్యూబ్ (YouTube) లో రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది.
అతి తక్కువ టైంలోనే మిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప 2 (Pushpa 2) టీజర్ తాజా మరో రికార్డు ను సొంతం చేసుకుంది.
ఏకంగా 138 గంటల్లో యూట్యూబ్ లో నంబర్ వన్ స్థానంలో రన్ అవుతున్న టీజర్ గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.
పుష్ప 2 టీజర్ కు 110 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 1.55 మిలియన్ల లైకు లభించాయి.
Pushpa 2 teaser
ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 విడుదల
ఈ విషయాన్ని పుష్ప 2 చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల కానున్న ఈ సినిమాపై ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇప్పటికే పుష్ప 2 రిలీజ్ డేట్ లాక్ తో పలు హిందీ సినిమాలు సైతం విడుదలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తో అంచనాలు పెరిగిపోయాయి.
పుష్ప దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న ఈ సీక్వెల్ సినిమాలో రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తోంది.