Rajinikanth: శ్రీదేవితో లవ్ ట్రాక్ నడిపిన సూపర్ స్టార్ రజనీకాంత్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ సినిమా ఐకానిక్ హీరోయిన్లలో శ్రీదేవి (Sridevi) అగ్రస్థానంలో నిలుస్తుంది.
తన అపూర్వ సౌందర్యం, నటనా నైపుణ్యంతో ఇండియన్ సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించింది.
ఆమె నటించిన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నారు. అందుకే సహనటులు కూడా ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించేవారు.
ఓ దశలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా శ్రీదేవిని హీరోయిన్‌గా ఎంచుకోవాలని ఎక్కువగా ఆసక్తి కనబర్చారట. అంతేకాదు, శ్రీదేవితో లవ్ ట్రాక్ కూడా నడిపాడని టాక్.
వివరాలు
శ్రీదేవి - రజనీకాంత్ జోడీ
శ్రీదేవి, రజనీకాంత్ (Rajanikanth) కలిసి పలు తమిళ సినిమాల్లో నటించారు. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు అమితంగా నచ్చేది. వీరిద్దరూ కలిసి నటించినప్పుడు థియేటర్ సందడి వాతావరణాన్ని సంతరించుకునేది. శ్రీదేవి వయస్సు 13 సంవత్సరాలు ఉన్నప్పుడే రజనీకాంత్‌తో బలమైన బంధం ఏర్పడింది.
వివరాలు
రజనీ సైలెంట్ ప్రేమ
1976లో వచ్చిన 'మూండ్రు ముడిచు'అనే తమిళ చిత్రంతో శ్రీదేవి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ చిత్రానికి కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. విశేషమేంటంటే,ఈ సినిమాలో శ్రీదేవి రజనీకాంత్‌కు సవతి తల్లిగా నటించింది.
వయసులో చాలా చిన్నదైనా ఈ పాత్రను అంగీకరించాల్సి వచ్చింది. సినిమా సెట్స్‌లో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
శ్రీదేవి చిన్న వయస్సు అవ్వడంతో రజనీ చాలా కేర్ తీసుకునేవారు. ఇదే బంధం వారి మధ్య అనుబంధానికి బాటలు వేసింది.
శ్రీదేవితో కలిసి పని చేస్తున్న సమయంలో రజనీకాంత్‌కి ఆమెపై ప్రత్యేకమైన అభిమానం పెరిగిందట.
వయస్సులో చిన్నదైనా ఆమెను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. రజనీ తల్లితో శ్రీదేవికి సన్నిహిత సంబంధం ఉండేది, దీంతో వారి మధ్య ఆఫ్‌స్క్రీన్ బాండ్ మరింత గాఢమైంది.
వివరాలు
రజనీ ప్రేమ వ్యక్తం చేయలేకపోయాడా?
శ్రీదేవితో ప్రొఫెషనల్ రిలేషన్ చాలా బలంగా ఉండటంతో, రజనీకాంత్ ఆమెను మనసులో ప్రేమించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆయన భయపడ్డాడని, భవిష్యత్తులో సమస్యలు ఎదురుకావచ్చనే ఆలోచనతో వెనకడుగేశారు.
ఒకసారి ధైర్యం చేసి తన ప్రేమను చెప్పాలనుకున్నప్పటికీ, శ్రీదేవి ఇంటికి వెళ్లగానే లైట్స్ ఆఫ్ అవ్వడంతో దీన్ని అశుభంగా భావించిన రజనీ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట.
ఆ తర్వాత మరోసారి కూడా తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించలేదు. దీంతో వారి మధ్య సంబంధం కేవలం స్నేహానికే పరిమితమైంది.
వివరాలు
శ్రీదేవి జీవిత ప్రయాణం
రజనీకాంత్ ప్రేమ విషయం పక్కన పెడితే, శ్రీదేవి ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ను వివాహం చేసుకొని తన జీవితం కొనసాగించింది.
సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె తనదైన ముద్ర వేశారు.
అయినప్పటికీ, రజనీకాంత్‌తో తుదివరకు మంచి స్నేహాన్ని కొనసాగించింది.
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రజనీకాంత్ - శ్రీదేవి జోడీ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
నిజ జీవితంలో ప్రేమ వ్యవహారం సఫలం కాకపోయినప్పటికీ, వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఉర్రూతలూగించింది.