LOADING...
Peddi : రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో
రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో

Peddi : రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోకాలంగా ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఈ ప్రోమో ద్వారా మంచి హైప్ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం, 'పెద్ది' ట్రైలర్ లాంచ్ వేడుకను మే 18న ముంబైలో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

వివరాలు

సినిమాపై మరింత ఆసక్తి..

"పెద్ది గాడు ఇక్కడ కొడితే బాల్ ముంబైలో పడింది" అనే డైలాగ్‌తో వచ్చిన ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో, ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి మేకర్స్ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రోమో చివర్లో రామ్ చరణ్‌కు సంబంధించిన కుస్తీ పోరాట సన్నివేశాన్ని చిన్న గ్లింప్స్ రూపంలో చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో చరణ్ కనిపించిన పవర్‌ఫుల్ అవతారం, అలాగే బుచ్చిబాబు టేకింగ్ స్టైల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

వివరాలు

ప్రేక్షకుల్లో మరింత హైప్..

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' భారీ ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. క్రికెట్, కుస్తీ వంటి స్పోర్ట్స్ అంశాలతో పాటు పీరియాడిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మే 18న విడుదల కానున్న ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

Advertisement