Page Loader
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. దుబాయ్‌ నుంచి రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు 
సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. దుబాయ్‌ నుంచి రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కి వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న సల్మాన్‌ తన భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు దుబాయ్‌ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు కూడా సమాచారం. ఈ కారు ధర రూ.2 కోట్లు ఉంటుందని, త్వరలోనే ఇది సల్మాన్‌ గ్యారేజ్‌లో చేరనుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వివరాలు 

60 మంది సెక్యూరిటీ సిబ్బంది

మరోవైపు, కట్టుదిట్టమైన భద్రత నడుమ, సల్మాన్‌ శుక్రవారం బిగ్‌ బాస్‌ షో షూట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో దాదాపు 60 మంది సెక్యూరిటీ సిబ్బంది సెట్‌లో ఉండి నిరంతరం ఆయన్ని పర్యవేక్షించారు. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో, సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటికే పలుమార్లు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో, సల్మాన్‌ నివాసం ఉన్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. సల్మాన్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.

వివరాలు 

సల్మాన్‌ నాకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు: సలీం

తన తప్పు తెలుసుకుని, సల్మాన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ డిమాండ్‌ చేసిన విషయంపై ఆయన తండ్రి సలీంఖాన్‌ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సలీం, "సల్మాన్‌ నాకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు. మూగజీవాలను వెంటాడటం ఆయనకు ఇష్టం ఉండదు. జంతువులను ఎంతో ప్రేమిస్తాడు. క్షమాపణ చెబితే తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా. బొద్దింకలను చంపడం కూడా ఆయనకు తెలియదు" అని పేర్కొన్నారు.