
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావ్.. స్పష్టం చేసిన మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సౌరబ్ గంగూలీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌కు హీరో ఎంపికైన విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీయే అధికారికంగా ప్రకటించడం విశేషం. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తున్నారన్న వివరాలను, అలాగే విడుదల తేదీ గురించి కీలక వివరాలు వెల్లడించారు.
వివరాలు
గంగూలీ పాత్రలో రాజ్ కుమార్ రావ్
బాలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న రాజ్ కుమార్ రావ్,ఇప్పుడు సౌరవ్ గంగూలీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈవిషయాన్ని స్వయంగా దాదా గురువారం మీడియాతో స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.."నేను విన్న దాని ప్రకారం రాజ్ కుమార్ రావ్ నా పాత్ర పోషించబోతున్నాడు. కానీ షూటింగ్ షెడ్యూల్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. బహుశా మరో ఏడాది పైగానే తీసుకోవచ్చు"అని చెప్పారు. గంగూలీ బయోపిక్ రూపొందనుందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఇదే విషయంపై స్పందించిన ఆయన,తనపాత్రను బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ,తాజా పరిస్థితుల ప్రకారం రాజ్ కుమార్ రావ్ ఫైనల్ అయినట్టు స్పష్టం అయ్యింది.
వివరాలు
రాజ్ కుమార్ రావ్ ప్రస్తుత ప్రాజెక్టులు
ప్రస్తుతం రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్‌లో బిజీ నటుడు.ఆయన తన తదుపరి సినిమా "భూల్ చూక్ మాఫ్" కోసం సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా,అందులో ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో రాజ్ కుమార్ రావ్ కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని కరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథలోని ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే హల్దీ వేడుక రోజే వచ్చింది అని హీరో గ్రహించి షాక్ అవుతాడు.ఈ కథ గురించి పూర్తిగా స్పష్టత రాకపోయినా, టీజర్ కొత్తగా అనిపిస్తోంది.వామికా గబ్బి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక "భూల్ చూక్ మాఫ్"మాత్రమే కాకుండా,మరో "మాలిక్" అనే సినిమా కూడా రాజ్ కుమార్ రావ్ చేస్తున్నాడు.
వివరాలు
సౌరవ్ గంగూలీ.. ఒక లెజెండరీ కెప్టెన్
సౌరవ్ గంగూలీ టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు.భారత్ తరఫున 113 టెస్టులు,311 వన్డేలు ఆడిన ఆయన,అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత,బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా,ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా తన సేవలు అందించాడు. ఇలాంటి గొప్ప క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నఈ బయోపిక్,అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా రాజ్ కుమార్ రావ్ లాంటి ప్రతిభాశాలి నటుడు గంగూలీ పాత్ర పోషించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాదా మాటలను బట్టి చూస్తే,ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఎంఎస్ ధోని,సచిన్ టెండూల్కర్ జీవిత కథలపై బయోపిక్స్ తెరకెక్కగా,ఇప్పుడు ఆ జాబితాలో సౌరవ్ గంగూలీ కూడా చేరబోతున్నారు!