LOADING...
Kollywood: మలేషియాలో స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ఆడియో లాంచ్..  ఎప్పుడంటే..? 
మలేషియాలో స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ఆడియో లాంచ్..  ఎప్పుడంటే..?

Kollywood: మలేషియాలో స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ఆడియో లాంచ్..  ఎప్పుడంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా 'జననాయకన్'. ఇది ఆయన కెరీర్‌లో 69వ సినిమాగా రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తుండగా, ప్రేమలు బ్యూటీ మమతా బైజు ఈ చిత్రంలో విజయ్ కుమార్తె పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ప్రతినాయకుడిగా కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

వివరాలు 

2026 సంక్రాంతి సందర్భంగా విడుదల 

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న జననాయకన్ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, చెన్నై సినీ వర్గాల నుండి ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. జననాయకన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ను మలేషియాలో నిర్వహించేందుకు చిత్ర బృందం యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకను డిసెంబర్ 27న నిర్వహించాలనే తేదీని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

వివరాలు 

అనిరుధ్, విజయ్ కోసం ఓ ప్రత్యేక రాప్ సాంగ్‌ కి ప్లాన్ 

ఈ చిత్రం తరువాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆయన స్థాపించిన TVK పార్టీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ జననాయకన్ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడం కోసం కృషి చేస్తున్నాడు. మరోవైపు అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాను విజయ్ అభిమానులు విశేషంగా సెలెబ్రేట్ చేయాలని ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు అనిరుధ్, విజయ్ కోసం ఓ ప్రత్యేక రాప్ సాంగ్‌ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.