Page Loader
Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..! 
విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..!

Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌కు డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్‌కి వెళ్లే ముందు చాలామంది స్టార్ హీరోలకు స్టార్‌డమ్‌ అందించారు. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ వంటి టాప్ హీరోల కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు పూరి. కానీ ప్రస్తుతం ఈ స్టార్ హీరోల్లో ఎవ్వరూ ఆయన వైపు తిరిగి చూడకపోవడం గమనార్హం. ఇటీవల లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు తీవ్ర పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో పూరీ కొత్త ప్రయత్నంగా తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Details

కీలక పాత్రలో రాధిక ఆప్టే

ముఖ్యంగా ఈ సినిమా హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక దశలో ఉంది. సీనియర్ బాలీవుడ్-టాలీవుడ్ హీరోయిన్ టబు ముఖ్య పాత్రలో నటించనున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా మరో కీలక పాత్ర కోసం ప్రముఖ నటి రాధిక ఆప్టేను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది. గతంలో రాధిక ఆప్టే సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది

Details

జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం

. ఇప్పుడు పూరి దర్శకత్వంలో నటించనున్న ఈ పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక షూటింగ్ విషయానికొస్తే, ఈ సినిమా జూన్ నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. పూరీ కూడా గత ఫలితాల నుంచి గ్యాప్ తీసుకుని ఈసారి కొత్తగా ప్రయత్నించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.