Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో విరాట్ కోహ్లీ భార్య..? అనుష్క శర్మ రీ-ఎంట్రీనా?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న బన్నీ, ఇటీవల పుష్ప, పుష్ప 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు స్టార్ దర్శకుడు అట్లీతో కలిసి మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన అప్డేట్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కనుందని వీడియో ద్వారా సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
భారీ అంచనాలు పెంచిన క్రేజీ ప్రాజెక్ట్
ప్రీ-ప్రొడక్షన్ వీడియో చూస్తే, ఇది ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందనుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇన్‌సైడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
వివరాలు
హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్..
ఈ సినిమాలో హీరోయిన్స్ విషయమై ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విరాట్ కోహ్లీను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన అనుష్క శర్మ, ఇప్పుడు ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.