Page Loader
Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 'విశ్వంభ‌ర' టీజ‌ర్.. విడుదల ఎప్పుడంటే!
మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 'విశ్వంభ‌ర' టీజ‌ర్.. విడుదల ఎప్పుడంటే!

Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 'విశ్వంభ‌ర' టీజ‌ర్.. విడుదల ఎప్పుడంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు, 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరంజీవితో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, అందులో సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి రెండు పాటలు మరియు క్లైమాక్స్ షూట్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఈ రోజు సాయంత్రం టీజర్‌

ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రమోషన్లను ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ రోజు సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు, సినిమాకి సంబంధించి ఓ బ్రేకింగ్ అప్డేట్ ను తెలియజేయనునట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా 'ఆర్‌ఆర్‌ఆర్' ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్