Page Loader
Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్‌ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌..

Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్‌ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ స్కాట్లాండ్‌కు చెందిన యూట్యూబర్ క్యాలమ్ మిల్ తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జ్యోతి మల్హోత్రా పాక్‌ పర్యటనలో భాగంగా కనిపించగా, అక్కడ ఆమెకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. పాకిస్థాన్‌ పర్యటనలో భాగంగా క్యాలమ్ మిల్ తీసిన అనేక వీడియోలను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. వాటిలో ఒకదాంట్లో లాహోర్ నగరంలోని అనార్కలి బజార్ ప్రాంతంలో జ్యోతి మల్హోత్రా వీడియోలు తీస్తుండగా ఆమెతో క్యాలమ్ మిల్ ఎదురయ్యాడు.

వివరాలు 

ఏకే-47 తుపాకులతో ఆమెకు భద్రత

ఆ సమయంలో క్యాలమ్ మిల్ ఆమెతో పలకరించి మాట్లాడుతుండగా, తాను స్కాట్లాండ్‌కు చెందిన యూట్యూబర్‌ని అని చెప్పాడు. ఈ నేపథ్యంలో జ్యోతి సమాధానంగా తాను భారత్‌ నుండి వచ్చినట్టు తెలిపింది. అనంతరం జ్యోతి అతడిని'మీరిప్పుడు మొదటిసారిగా పాకిస్థాన్‌ వచ్చారా?'అని ప్రశ్నించగా,క్యాలమ్ ఇప్పటివరకు ఐదు సార్లు పాక్‌కి వచ్చానని చెప్పాడు. పాకిస్థాన్‌ ఆతిథ్యంపై ఆమె అభిప్రాయాన్ని అడిగినప్పుడు, "చాలా బాగుంది" అని జ్యోతి సమాధానమిచ్చింది. తర్వాత ఆమె అక్కడినుండి వెళ్లిపోయే సమయంలో,ఆమె చుట్టూ సాధారణ దుస్తుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఏకే-47 తుపాకులతో ఆమెకు భద్రత కల్పిస్తున్నట్లు క్యాలమ్ గమనించాడు. దీనిని చూసిన అతడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.వారందరూ వేసుకున్న జాకెట్లపై "నో ఫియర్" అనే పదాలు ముద్రించి ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది.

వివరాలు 

పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జ్యోతి మల్హోత్రా  సంబంధాలు

ఒక సాధారణ పర్యాటకురాలికి ఇంత స్థాయిలో సాయుధ భద్రత అవసరమా? అంటూ క్యాలమ్ తన వీక్షకులను ప్రశ్నించాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. అయితే వీడియోలో ఆమె చుట్టూ మరికొందరు పర్యాటకులు కూడా ఉండటంతో ఆ భద్రత కేవలం జ్యోతి కోసమా? లేదా ఆమె బృందం మొత్తం కోసమా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇక గూఢచర్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్టు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ హైకమిషన్‌లో పని చేసే డానిష్ అనే వ్యక్తితో తాను తరచూ టచ్‌లో ఉండేదాన్నీ, అతడిని మొదటిసారి 2023లో వీసా కోసం హైకమిషన్‌కు వెళ్లినప్పుడు కలిసినట్టు తెలిపింది.

వివరాలు 

 జ్యోతి పాక్‌కు కీలక సమాచారం 

పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు కీలక సమాచారం అందించినట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వెళ్లే భారతీయులను లక్ష్యంగా చేసుకుని, వారిని గూఢచర్యానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. అలాంటి తరహాలోనే డానిష్ కూడా జ్యోతిని టార్గెట్ చేశాడని పోలీసులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..