నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రులు ఎవరు? ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసుకుందాం.
అరవింద్ కేజ్రీవాల్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా దిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవడం లేదని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు.
మమతా బెనర్జీ: నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరు కాకూడదని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందే నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శిని పంపాలని టిఎంసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
దిల్లీ
హైదరాబాద్‌లో కేసీఆర్- కేజ్రీవాల్ సమావేశం
నితీష్ కుమార్: ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల నితీష్ కుమార్ హాజరు కాలేకపోయారని బిహార్ మంత్రులు చెప్పారు.
ఎం.కె స్టాలిన్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. అందుకే ఆయన హాజరుకాలేదు.
కేసీఆర్: కేజ్రీవాల్‌తో శనివారం హైదరాబాద్‌లో సమావేశం కావాల్సి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి హాజరుకావడం లేదు.
భగవంత్ మాన్: రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా పంజాబ్ ముఖ్యమంత్రి సమావేశానికి హాజరుకావడం లేదు.
అశోక్ గెహ్లాట్: అనారోగ్య కారణాలతో సిఎం గెహ్లాట్ సమావేశానికి హాజరు కావడం లేదని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పినరయి విజయన్: కేరళ సీఎం విజయన్ గైర్హాజరు కావడానికి ఎటువంటి నిర్దిష్ట కారణాలను తెలపలేదు.