NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిపర్‌జాయ్‌ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం
    తదుపరి వార్తా కథనం
    బిపర్‌జాయ్‌ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం
    95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం

    బిపర్‌జాయ్‌ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 14, 2023
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిపర్‌జాయ్‌ తుఫాను కారణంగా గుజరాత్ లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

    మరో 58 రైళ్ల ప్రయాణ దూరాన్ని కుదిస్తూ రైళ్లు బయలుదేరే స్టేషన్, గమ్యస్థానాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు వివరించింది.

    గురువారం సాయంత్రానికి తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

    రేపు సాయంత్రం నాటికి అరేబియా సముద్రం తీరంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటునుంది. గుజరాత్‌పై తుఫాను విరుచుకుపడి, విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

    DETAILS

    తీరాల్లో 6 మీటర్ల ఎత్తున అలలు పోటెత్తే అవకాశం : ఐఎండీ

    తుపాను తీరం తాకే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సుమారు 6 మీటర్ల ఎత్తున అలలు పోటెత్తుతాయని అధికారులు వివరించారు.

    ప్రస్తుతం బిపర్‌జాయ్‌ తుఫాను పోర్‌ బందర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో తీర ప్రాంత జిల్లాలకు చెందిన దాదాపు 30 వేల మంది ప్రజలను అధికారులు తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు.

    సుమారు 95 రైళ్లను రద్దు చేశామన్న అధికారులు, జూన్‌ 15 వరకు రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

    DETAILS

    ఆ సున్నిత ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి : ఐఎండీ

    ఏషియన్ లయన్స్ కి ఏకైక ఆవాసమైన గిర్‌ నేషనల్‌ పార్కు (వన్యప్రాణుల అభయారణ్యం), ప్రముఖ శివ క్షేత్రం, జ్యోతిర్లింగం సోమనాథ్‌ వంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఐఎండీ అధికారులు ప్రభుత్వానికి సూచనలు చేశారు.

    బిపర్‌జాయ్‌ తుఫాను తీరం దాటే రోజున కచ్‌, దేవభూమి ద్వారకా, జామ్‌నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షం కురవనుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

    ఈ మేరకు రాష్ట్రంలోని పోర్‌బందర్‌, రాజ్‌ కోట్‌, మోర్బీ సహా నాఘర్‌ ప్రాంతాల్లోనూ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    గుజరాత్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  తాజా వార్తలు
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తెలంగాణ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు పశ్చిమ బెంగాల్

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025