Page Loader
AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు
దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు

AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్మథనానికి గురవుతున్నట్టు సమాచారం. భారత రాజధానిలో మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌‌పై 'అతివిశ్వాసం' మితిమీరిందని ఆప్ విమర్శించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌ అతివిశ్వాసంతో ఉందన్నారు. తాము అహంకార బీజేపీపై పోటీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని ఆప్‌ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు. ఆమె హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలను పట్టించుకోలేని, దీని మూలంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురైన ఓటమి కారణమని ఆరోపణలు చేశారు

Details

కాంగ్రెస్‌-ఆప్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలం

దిల్లీలో 10 సంవత్సరాలుగా ఒక్క సీటు గెలవని కాంగ్రెస్‌ ఇటీవల లోక్‌సభలో మూడున్నర సీట్లు గెలుచుకుంది. అయినప్పటికీ హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదని ఆప్‌ విమర్శలు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌-ఆప్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ మెజార్టీ మార్కుకు దూరంగా ఉండగా, ఆప్‌ అసలు ఖాతా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్‌ విజయాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.